ETV Bharat / city

Bandi Sanjay Fires On CM KCR: 'నిరంకుశ పాలనపై ప్రశ్నిస్తే.. సంకెళ్లు వేస్తారా.?'

Bandi Sanjay Fires On CM KCR: జీవో 317 కు వ్యతిరేకంగా కరీంనగర్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన జాగరణ దీక్ష.. అరెస్టులకు దారితీసింది. దీక్ష చేస్తున్న భాజపా నేతలను అడ్డుకున్న పోలీసులు.. బండి సంజయ్​ను అరెస్టు చేశారు. కరీంనగర్​ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్​ విధించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్​పై విరుచుకుపడిన బండి సంజయ్​.. కేసీఆర్​ను నిలదీస్తూ ట్వీట్​ చేశారు.

bandi sanjay arrest
బండి సంజయ్​
author img

By

Published : Jan 3, 2022, 7:26 PM IST

Bandi Sanjay Fires On CM KCR: నిర్బంధాలు, అరెస్టులు.. ప్రజలతో అనుబంధాన్ని తెంపలేవని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. నీ అరాచక పాలనలో నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తే సంకేళ్లు వేస్తావా అంటూ సీఎం కేసీఆర్‌నుద్దేశించి ట్విట్టర్ వేదికగా నిలదీశారు. కేసీఆర్​ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని.. గుర్తుంచుకోవాలని జోస్యం చెప్పారు. ప్రజల తరపున ప్రశ్నిస్తే, ప్రశ్నించే గొంతును అధికార మదంతో మూయించాలని చూస్తున్నారని మండిపడ్డారు.

  • నిర్బంధాలు,అరెస్టులు
    ప్రజల మధ్య సంబంధాన్ని తెంపలేవు.
    నీ ఆరాచక పాలనలో నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తావా ?
    నీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని గుర్తుంచుకో.
    ప్రజల తరుపున ప్రశ్నిస్తే,
    ప్రశ్నించే గొంతును నీ అధికార మదంతో మూయించాలని చూస్తున్నావు. pic.twitter.com/RA1VFsZxdL

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఏం జరిగిందంటే

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం విడుదల చేసిన.. జీవో 317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ బండి సంజయ్​ చేపట్టిన జాగరణ దీక్షను.. పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం రాత్రి కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన దీక్షకు అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. వారిని తప్పించుకొని.. కార్యాలయంలోకి వెళ్లి సంజయ్‌ దీక్ష చేపట్టగా పోలీసులు తలుపులు పగులగొట్టి.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. సంజయ్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు.. అనంతరం కోర్టుకు తరలించారు. కరీంనగర్​ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సంజయ్‌ సహా కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్‌, పుప్పాల రఘు, కాచు రవి, మర్రి సతీశ్‌కు ఈనెల 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ఇదీ చదవండి: BJP Leaders on Bandi Sanjay Arrest: అంతా మీ ఇష్టమేనా... మీకు కొవిడ్ నిబంధనలు వర్తించవా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.