వెంటనే స్పందించిన మంత్రి విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు ప్రయాణికుల కోసం రాజేంద్రనగర్ డిపోకు చెందిన బస్సును వెంటనే ఏర్పాటు చేసి ప్రయాణికులను పంపారు.
బ్యాటరీ ఫెయిల్.. పనిచేయని సెల్ఫ్...
అనంతరం బస్సు ఆలస్యంపై డిపోలో అధికారులు విచారణ జరిపారు. బ్యాటరీ దిగిపోయి బస్సు సెల్ఫ్ పనిచేయక.. బస్సు పంపలేదని విచారణలో తేలింది. ఈ నివేదికను మంత్రికి పంపుతున్నారు. పూర్తి నివేదిక సిద్ధమయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జగిత్యాల డిపో మేనేజరు జగదీశ్వర్ తెలిపారు.
మొత్తానికి మంత్రిగారికి పంపిన ఓ ఎస్ఎంఎస్తో అధికారులు నిద్రలేచారు. అదే మెసేజ్ లేకుంటే.. ప్రయాణికుల సమస్య ఎప్పటికి తీరేదో మనకు తెలియంది కాదు.
ఇవీ చూడండి: వచ్చే నెల నుంచే రూ. 2000 పింఛన్ : ఈటల