ETV Bharat / city

MP Raghurama: వైకాపా వెబ్​సైట్ నుంచి ఎంపీ రఘురామ పేరు తొలగింపు - YSRCP MP Raghuram krishnaraju name Missing in Party Website

ఏపీకి చెందిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghuram Krishna Raju) పేరు.. ఆ పార్టీ అధికారిక వెబ్​సైట్ నుంచి మాయమైంది. వెబ్​సైట్​లోని 28 మంది ఎంపీల పేర్ల జాబితాలో రఘురామ పేరు కనిపించలేదు. దీనిపై ఆ పార్టీ నుంచి ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

వైకాపా వెబ్​సైట్ నుంచి ఎంపీ రఘురామ పేరు తొలగింపు

author img

By

Published : Jun 13, 2021, 5:50 AM IST

వైకాపా అధికారిక వెబ్​సైట్​లో ఉన్న ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి ఆంధ్రప్రదేశ్​లోని నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు(Raghuram Krishna Raju) పేరును తొలగించారు. రాజ్యసభ, లోక్​సభకు కలిపి ఆ పార్టీ తరపున 28 మంది ఎంపీల పేర్లు గతంలో వెబ్​సైట్​లోని జాబితాలో పొందుపరిచారు. తిరుపతి నుంచి ఇటీవలే ఎన్నికైన గురుమూర్తి పేరును కూడా ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామకృష్ణరాజు(Raghuram Krishna Raju) పేరు ఇప్పుడు జాబితాలో లేదు. దీనిపై ఆ పార్టీ నుంచి ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

ఈ రోజు నన్ను పార్టీ నుంచి బహిష్కరించారా?

'ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడు నన్ను పార్టీ నుంచి బహిష్కరించారా?' అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారిక వెబ్​సైట్​లో ఎంపీల జాబితాలో తనపేరు లేకపోవటంపై ఆయన ప్రకటనలో స్పందించారు. తన పార్లమెంట్ సభ్యత్వ అనర్హత అంశం తలెత్తబోదని ఆయన తెలిపారు. తనపై అనర్హత వేటు వేయాలని లోక్​సభ స్పీకర్​ను పార్టీ నేతలు కోరడంతో..అనేక మంది ఫోన్లు చేస్తున్నారని, సందేశాలు పంపుతున్నారని ఆయన వివరించారు. అనర్హత వేటు వేయాలని ఇప్పటికే విన్నవించారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: KTR: అద్భుత పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.