ETV Bharat / city

వైకాపా నేత దారుణ హత్య.. సొంత పార్టీ నేతల పనే అంటోన్న తల్లి - అధికార పార్టీ నేతలే నా కొడుకును చంపారు తల్లి

YSRCP Leader Murder: ఏపీలోని సత్యసాయి జిల్లాలో వైకాపా నేత రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇంటి సమీపంలో కారును పార్క్ చేస్తున్న సమయంలో మూకుమ్మడిగా వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. గత కొంతకాలంగా రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వర్గీయుల మధ్య తీవ్ర వర్గపోరు చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇదిలా ఉండగా సొంత పార్టీ నాయకులే తన కుమారుడిని హత్య చేశారని మృతుని తల్లి ఆరోపించారు.

వైకాపా నేత దారుణ హత్య.. సొంత పార్టీ నేతల పనే అంటోన్న తల్లి

author img

By

Published : Oct 9, 2022, 12:24 PM IST

YSRCP Leader Murder: ఆంధ్రప్రదేశ్​లోని సత్యసాయి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైకాపా అసమ్మతి నేత చౌలూరు రామకృష్ణారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న రామకృష్ణారెడ్డి.. ఇంటి సమీపంలో కారును పార్క్ చేస్తున్న సమయంలో వేట కొడవళ్లతో 18 చోట్ల నరికారు. తీవ్ర గాయాలైన రామకృష్ణారెడ్డిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సొంత పార్టీ నేతలే తన కుమారుడిని చంపారని రామకృష్ణారెడ్డి తల్లి ఆరోపించారు. ఎమ్మెల్సీ, మరికొంత నాయకులు కలిసి.. తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారంటూ విలపించారు.

ఇటీవల హిందూపురం వైకాపాలో వర్గ విభేదాలు చోటుచేసుకుని ఆగస్టు 15న ఉద్రిక్తత ఏర్పడింది. అప్పుడు చౌలూరు రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వర్గీయుల మధ్య వర్గపోరు తీవ్ర స్థాయికి చేరింది. ఆ వివాదం నెలకొన్న చోటే చౌలూరు రామకృష్ణారెడ్డి హత్యకు గురయ్యారు.

మృతదేహంతో ఆందోళన: హత్యకు గురైన వైకాపా నేత రామకృష్ణారెడ్డి మృతదేహంతో హిందూపురం చౌలూరులో బంధువులు ఆందోళన చేపట్టారు. వైకాపాలో వర్గ విభేదాలతో హత్య చేశారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..:

ప్రేమోన్మాది చేతిలో యువతి హత్య ఘటన.. కఠిన చర్యలకు సీఎం ఆదేశం..

డ్యామ్​లో ముగ్గురు బాలికల మృతదేహాలు.. ఆత్మహత్యా? హత్యా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.