ETV Bharat / city

SHARMILA: మహాయజ్ఞానికి ఆశీర్వాదం లభించింది: షర్మిల - ఇడుపులపాయలో వైఎస్ షర్మిల

తెలంగాణ ప్రజల సంక్షేమానికై.. తాను చేయబోయే మహాయజ్ఞానికి తన తల్లి వైఎస్‌ విజయమ్మ పక్క నుండి ఆశీర్వదించినట్లు వైఎస్ షర్మిల తెలిపారు. నాన్న పైనుంచి దీవిస్తున్నాడని ట్వీట్‌ చేశారు. ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న షర్మిలకు అభిమానులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

SHARMILA
SHARMILA
author img

By

Published : Jul 8, 2021, 3:14 PM IST

Updated : Jul 8, 2021, 3:37 PM IST

తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ పేరుతో జెండా, అజెండాను వెల్లడించనున్నారు. ఇవాళ ఉదయం వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానానికి తన తల్లి విజయమ్మ నుంచి ఆశీర్వాదం లభించిందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తల్లితో దిగిన ఫోటోను ట్విట్టర్‌లో షర్మిల జత చేశారు.

  • తెలంగాణ ప్రజల సంక్షేమానికై ..
    మనం చేయబోయే మహాయజ్ఞానికి
    అమ్మ పక్కనుండి ఆశీర్వదించింది ..
    నాన్న పైనుండి దీవిస్తున్నాడు ..
    వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం! pic.twitter.com/VEqeTgYFXe

    — YS Sharmila (@realyssharmila) July 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ ప్రజల సంక్షేమానికై.. మనం చేయబోయే మహాయజ్ఞానికి అమ్మ పక్క నుండి ఆశీర్వదించింది. నాన్న పైనుండి దీవిస్తున్నాడు. వారి ఆశీస్సులతో మనం తప్పకుండా విజయం సాధిస్తాం! - వైఎస్ షర్మిల

ఘన స్వాగతం..
బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న షర్మిల

కొద్దిసేపటి క్రితమే షర్మిల ఇడుపులపాయ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. షర్మిలకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు ఆమెకు స్వాగతం పలికిన అనంతరం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం ప్రాంగణమంతా షర్మిల పార్టీ కార్యకర్తలు అభిమానులతో కోలాహలంగా మారింది. షర్మిల పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ర్యాలీగా బయలుదేరారు.

సాంస్కృతిక ప్రదర్శనలతో షర్మిలకు స్వాగతం
సాంస్కృతిక ప్రదర్శనలతో షర్మిలకు స్వాగతం

పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి పూలమాల

బేగంపేట నుంచి ర్యాలీగా బయలుదేరి పంజాగుట్ట సర్కిల్‌కు చేరుకున్న షర్మిల.. వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌ కేంద్రానికి బయలుదేరారు.

ఇవీ చూడండి: YS SHARMILA : ఇడుపులపాయలో వైఎస్​ఆర్​కు షర్మిల ఘన నివాళి

Last Updated : Jul 8, 2021, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.