వైఎస్ షర్మిల ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారని షర్మిల కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో పర్యటనలో భాగంగా పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. ఉదయం 7:30 గంటలకు లోటస్పాండ్ నుంచి వైఎస్ షర్మిల నల్గొండ జిల్లా పర్యటనకు బయల్దేరనున్నారు.
10:30 గంటలకు ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యకు యత్నించిన నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని పరామర్శిస్తారు. 12:45 గంటలకు హుజూర్నగర్ సర్కిల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించనున్నారు. 2:30 గంటలకు కోదాడ సమీపంలోని దొండపాడులో వైఎస్ఆర్ అనుచరుడు, కుటుంబ సన్నిహితులు గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్లోని తన నివాసానికి బయల్దేరనున్నట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.