ETV Bharat / city

ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో వైఎస్ షర్మిల భేటీ - telangana news

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల హైదరాబాద్ లోటస్​పాండ్​లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి షర్మిలను కలిశారు.

YS Sharmila meets joint Khammam district chief leaders
ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో వైఎస్ షర్మిల భేటీ
author img

By

Published : Feb 15, 2021, 4:31 PM IST

ఈనెల 21న ఉమ్మడి ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో జరగాల్సిన షర్మిల సమావేశం.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా పడింది. ఈ క్రమంలో హైదరాబాద్ లోటస్​పాండ్​లోని నివాసంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

అనంతరం రంగారెడ్డి-హైదరాబాద్​కు చెందిన వైఎస్ అభిమానులు షర్మిలను కలిశారు. ఈనెల 20న ఈ జిల్లాలో నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే నేతలు ఆమెను కలిసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, తూడి దేవేందర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తిలు షర్మిలతో భేటీ అయ్యారు.

వైఎస్‌ కుటుంబ సభ్యులు కూడా తెలంగాణ ప్రాంతానికి ఎన్నో మంచి పనులు చేశారని మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి స్పష్టం చేశారు. షర్మిలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని...ఇది సరికాదని పేర్కొన్నారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో లోటస్‌పాండ్‌లో షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశానని రంగారెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.