ఏపీ ఎమ్మెల్సీ, వైకాపా నేత చల్లా రామకృష్ణారెడ్డి (72) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1948 ఆగస్టు 27న జన్మించిన రామకృష్ణారెడ్డి కర్నూలు జిల్లాలోని పాణ్యం ఎమ్మెల్యేగా, కోయిలకుంట్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తెలుగుదేశం, కాంగ్రెస్, వైకాపాలో రాజకీయ ప్రస్థానం సాగించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల ముందు వైకాపాలో చేరిన రామకృష్ణారెడ్డిని సీఎం జగన్ శాసనమండలికి పంపారు. రామకృష్ణారెడ్డి మృతి పట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 461 కరోనా కేసులు, 3 మరణాలు