వైకాపా నేత, నగరి ఎమ్మెల్యే రోజా.. ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీవారిని ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అయితే ఈ సమయంలో ఆమె కారులో వైకాపా జెండా, పార్టీ నాయకుల ఫోటోలతో కూడిన కరపత్రాలు ఉన్నాయి.
రాజకీయాలకు సంబంధించిన ఎలాంటి వస్తువులు కొండపైకి తీసుకురాకూడదు. నిబంధనలు అతిక్రమించారని ఎమ్మెల్యే రోజాపై విమర్శలు వస్తున్నాయి. ఆమె కారును భద్రతా సిబ్బంది తనిఖీ చేయకుండానే ఎలా అనుమతించారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: సోదరీసోదరుల మధ్య ప్రేమ, ఆప్యాయతకు సంకేతం రాఖీ: కేసీఆర్