హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌ను రాష్ట్ర డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛైర్మన్ అనిల్ కుమార్... కుటుంబ సమేతంగా సందర్శించారు. జూపార్క్‌లో ఉన్న చిరుతపులి, నల్ల త్రాచు, గుడ్లగూబను దత్తత తీసుకున్నారు.
ఒక ఏడాది పాటు దత్తత తీసుకున్నట్లు తెలిపిన అనిల్‌కుమార్... రెండు లక్షల విలువ చేసే చెక్కును డిప్యూటీ క్యూరియేటర్ నాగమణికి అందజేశారు. జూపార్క్‌లోని జంతువులను, పక్షులను దత్తత తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అనిల్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు.