ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత కన్సల్టేషన్ అందిస్తున్నట్టు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రకటించింది. క్యాన్సర్ రోగులకు ఉచిత కన్సల్టేషన్తో పాటు.... వ్యాధి నిర్ధారణ పరీక్షలపై 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు పేర్కొన్నాయి.
మొదటి సారి ఆసుపత్రికి వస్తున్న వారు, రీకన్సల్టేషన్ కోసం వచ్చే వారికి ఇది వర్తిస్తుందని వెల్లడించారు. క్యాన్సర్తో పోరాడుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సంస్థ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, యాజమాన్యం విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: పాతబస్తీపై యూపీ కాల్పుల ప్రభావం.. భద్రత కట్టుదిట్టం..