ఏపీలోని తిరుపతిలో ఉప్పరపల్లెకు చెందిన వనితావాణి... ఆటో నడపుతూ జీవనం సాగిస్తోంది. ఇంటి వద్ద పొరుగు వారితో ఏర్పడిన ఘర్షణపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. స్టేషన్ ఎస్సై ప్రకాశ్‌ను కలవగా... వెంటనే స్టేషన్ నుంచి బయటకు పొమ్మంటూ తనపై దాడికి పాల్పడ్డాడని వాపోయింది.
ఎస్సై అనుచిత ప్రవర్తనతో ఆవేదన చెందిన బాధితురాలు...న్యాయం చేయాలంటూ తన సోదరితో కలిసి ఠాణా ఎదుట బైఠాయించింది. బాధితురాలితో మాట్లాడిన సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి... ఈ ఘటనపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు.
- ఇదీ చదవండి : ఇక ఖమ్మం వంతు.. అధికార విపక్షాల వ్యూహాలు షురూ..