ETV Bharat / city

mother statue: మరణించిన తల్లిని.. మళ్లీ తండ్రి చెంతకు చేర్చిన కూతురు... అదెలా సాధ్యం అనుకుంటున్నారా? - విజయవాడ వార్తలు

ఆమె రూపం అతని కళ్ల నుంచి దూరం కావడంలేదు. ఆమె జ్ఞాపకాలు.... హృదయాంతరాలను దాటలేకపోతున్నాయి. జీవితాంతం తోడుగా నీడగా నిలుస్తోన్న సహధర్మచారిణి ఎడబాటు అతన్ని తీవ్రంగా బాధిస్తోంది. తల్లితో అంతటి అనుబంధాన్ని పెనవేసుకున్న తండ్రి... తల్లడిల్లుపోవడాన్ని చూసి కుమార్తె తట్టుకోలేకపోయింది. అందుకే(wife silicone wax statue) మరిచిపోలేని కానుకను తండ్రికి(gift to the father) అందించింది. అతడి కళ్లలో ఆనందాన్ని నింపింది..

statue
statue
author img

By

Published : Nov 14, 2021, 4:19 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ(vijayawada) చుట్టిగుంట సమీపంలో నివాసం ఉంటున్న మండవ కుటుంబరావుకు నాలుగు దశాబ్దాల క్రితం కాశీ అన్నపూర్ణతో వివాహమైంది. వ్యవసాయం- ప్రకృతి సేద్యంపై మమకారంతో తన కుమార్తెకు సస్య అని పేరు పెట్టి.. తమ నివాసాన్ని సస్యక్షేత్రంగా మార్చేశారు ఈ దంపతులు. నిత్యం బంధుమిత్రుల రాకపోకలతో సందడిగా ఉండే ఇంట్లో... ఏడాదిన్నర క్రితం నుంచి మౌనం ఆవహించింది. భార్య అన్నపూర్ణ అకాలమరణం కుటుంబరావును కోలుకోలేని దెబ్బతీసింది. జీవితాంతం తోడుగా నీడగా నిలుస్తుందనుకున్న సహధర్మచారిణి ఎడబాటును కుటుంబరావు తట్టుకోలేకపోయారు. ఆమె రూపాన్ని అతని కళ్ల నుంచి దూరం చేసుకోలేక నిరంతరం అన్నపూర్ణ గురించే ఆలోచిస్తుండేవారు.

తల్లి పుట్టిన రోజున తండ్రికి కానుక..
భార్య అన్నపూర్ణ ఆలోచనల నుంచి కుటుంబరావు బయటపడలేక పోవడాన్ని.. తన కుమార్తె సస్య గుర్తించింది. ఎలాగైనా తన తండ్రి ఒంటరితనాన్ని దూరం చేయాలనుకుంది. తన తల్లి పుట్టిన రోజు దగ్గరలోనే ఉందనే విషయాన్ని గుర్తు చేసుకుంది. వెంటనే విజయవాడలోని శిల్పశాల నిర్వాహకులతో చర్చించి... అన్నపూర్ణ విగ్రహాన్ని(silicone wax) తయారు చేయించింది. తన తల్లి పుట్టిన రోజున.. నాన్న పక్కన అమ్మను కూర్చోబెట్టాలనే తన పట్టుదలకు కార్యరూపం ఇచ్చింది. తన కుమార్తె ఆలోచన కాదనలేకపోయిన కుటుంబరావు … తన భార్య రూపాన్ని (wife statue) చూసి సజీవంగా తన చెంతనే ఉన్న అనుభూతిని పొందుతున్నారు.

మరణించిన తల్లిని.. మళ్లీ తండ్రి చెంతకు చేర్చిన కూతురు!

అన్నపూర్ణ నిజంగా బతికి వచ్చారా..!
అన్నపూర్ణ విగ్రహాన్ని(Annapurna idol) చూసి నిజంగా బతికి వచ్చారా అని ఆమె బంధువులు ఆశ్చర్యపోతున్నారు. చెమ్మగిల్లిన కళ్లతో, బరువెక్కిన గుండెలతో విగ్రహాన్ని తాకుతూ ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అన్నపూర్ణ రూపం, ఆహార్యం సజీవంగా నిలిచేలా చేసేందుకు స్వదేశీ, విదేశీ వస్తువులను వినియోగించామని విగ్రహ తయారీదారులు చెప్పారు. సాధారణ విగ్రహాల మాదిరిగా కాకుండా మట్టి విగ్రహానికి.. మైనం పూత పోసి తయారు చేశామని చెప్పారు.కేవలం 40 రోజుల్లోనే అన్నపూర్ణ విగ్రహాన్ని చేశామని శిల్పశాల నిర్వాహకులు వెల్లడించారు.

మళ్లీ ఇంట్లో సందడి..
అన్నపూర్ణ విగ్రహం(Annapurna idol) ఇంటికి రావడంతో నెలల తరబడి స్తబ్దుగా ఉన్న కుటుంబరావు ఇంట్లో... మళ్లీ సందడి నెలకొంది. ఆమె బంధువులు ఆశ్చర్యపోతున్నారు. భౌతికంగా ఆమె దూరమైనా... బంధుమిత్రులంతా అన్నపూర్ణ విగ్రహం వద్ద ఆమె పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి వారి ప్రేమను చాటుకున్నారు. తన తల్లి పుట్టిన రోజున సస్య అందించిన కానుకతో కుటుంబరావు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ముక్కు నుంచి రక్తం కారుతోందా? గులాబీ రేకులతో ఇలా చేయండి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.