ETV Bharat / city

వెలకట్టలేని ప్రేమ.. భర్తకు గుడి కట్టి నిత్యం పూజలు!

పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మింది ఆ మహిళ.. భర్త మరణానంతరం కూడా పూజిస్తూ.. ఆయన సేవకే అంకితమైంది. అంతేగాక ఆయనకు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తోంది.

wife
గుడి
author img

By

Published : Aug 12, 2021, 4:49 PM IST

భర్తకు గుడి కట్టి...

ఏపీ ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామానికి చెందిన అంకిరెడ్డి.. నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన భర్త మరణానంతరం ఆయనకు ఏకంగా గుడి కట్టి నిత్యం పూజలు చేస్తోంది అతని భార్య. అంతేకాదు.. ప్రతి పౌర్ణమి, శని, ఆదివారాల్లో పేదలకు అన్నదానం సైతం చేస్తోంది.

గురుగుల అంకిరెడ్డితో పద్మావతికి పదకొండేళ్ల క్రితం వివాహమైంది. అయితే అంకిరెడ్డి రోడ్డు ప్రమాదంలో 4 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. భార్య వెంకట పద్మావతి భర్తపై ప్రేమ, అభిమానంతో నిమ్మవరం గ్రామంలో గుడికట్టి.. భర్త విగ్రహం ప్రతిష్టించి... నిత్యం పూజలు చేస్తూ భర్త పాదసేవకే అంకితమైంది. ప్రతి ఏటా గురుపౌర్ణమికి ఆయన పేరుమీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా పెట్టుకుంది.

భర్తమీద ఆమె ఆరాధనాభావంపై అభినందనల వర్షం కురుస్తోంది. భార్యాభర్తల మధ్య ఉండే పవిత్రమైన అనుబంధానికి పద్మావతి చూపిస్తున్న అభిమానమే నిదర్శనమని పెద్దలు అంటున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.