రాష్ట్రంలో ఇవాళ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని సూచించింది. రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది.
ఇదీ చూడండి : చేపల వేటకు వెళ్లి ఇద్దరు మత్స్యకారులు గల్లంతు