ETV Bharat / city

వేసవిలో అప్రమత్తం అవాల్సిందే.. లేకుంటే అంతే

ఎండాకాలం వస్తుందంటే వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న కార్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సరైన సమయంలో సర్వీసింగ్‌కు ఇవ్వటం సహా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ ప్రమాదాల బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ తరహా ప్రమాదాలు జరగటానికి కారణాలేంటి..? వాటిని నియంత్రించటం ఎలా అన్నదీ వివరిస్తున్నారు. వాహనదారులు చేయాల్సిందల్లా ఒక్కటే..! ఈ సూచనలు, సలహాలు పాటించటం. విలువైన వాహనాలను కాపాడుకునేందుకు ఇంతకన్నా మార్గం ఏముంటుంది..?

why cars are burnt in summer
వేసవిలో అప్రమత్తం అవాల్సిందే.. లేకుంటే అంతే
author img

By

Published : Apr 6, 2021, 4:18 AM IST

వేసవిలో అప్రమత్తం అవాల్సిందే.. లేకుంటే అంతే

వాహనాల్లో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.... రోడ్డుప్రమాదాలు. ఇతర వాహనాలు లేదా దేన్నైనా బలంగా ఢీకొట్టినపుడు ఆ రాపిడికి నిప్పురవ్వలు ఎగిసిపడతాయి. అదే సమయంలో బ్యానెట్‌ కింద ఉండే ఫ్లూయిడ్‌లు, ఇంధనాలు, ఇంజిన్‌, బ్యాటరీ, గ్యాస్‌ట్యాంక్‌ లాంటివన్నీ చెల్లాచెదురవుతాయి. ఆ ఘర్షణలో చిన్న నిప్పురవ్వ వీటిపై పడినా క్షణాల్లో మంటలు వ్యాపించే అవకాశం ఉంది. నిప్పు, ఇంధనాలు ఒకదానికొకటి జత కలిస్తే జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. వైరింగ్‌లో నాణ్యత లోపం, ఇంజన్‌ వేడెక్కడం, ఆయిల్‌, డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ లీకేజీ కారణంగా మంటలు అంటుకునే ప్రమాదముంది. ఎక్కువ దూరం తిరిగే వాహనాలను తరచూ తనిఖీ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.

జాగ్రత్తలు తీసుకోకపోతే..

ప్రస్తుతం హైబ్రిడ్‌, విద్యుత్తు బ్యాటరీ కార్ల వాడకం పెరుగుతోంది. ఇవి పర్యావరణానికి, వినియోగదారుడికి మేలు చేయొచ్చుగానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే జరిగే నష్టం అపారం అంటారు వాహనరంగ నిపుణులు. కాలపరిమితి ముగిసినవి, నాణ్యతలేని బ్యాటరీలతో మంటలు త్వరగా చెలరేగుతాయి. వాహనంలో అత్యంత ఉష్ణోగ్రత ఉండేవాటిలో కాటలిటిక్‌ కన్వర్టర్‌ ఒకటి. ఇది కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌లాంటి విషపూరిత వాయువులను వడగట్టి కాలుష్యపు పొగను బయటికి పంపిస్తుంటుంది. దానికి ముందుండేది ఇంజిన్‌. ఇదీ ఉష్ణకేంద్రమే. స్పార్క్‌ప్లగ్‌లు, ఇతర పార్ట్స్‌లో ఏదైనా లోపం ఉంటే ఇంజిన్‌లో ఇంధనం సరిగా మండదు. అత్యధిక వ్యర్థాలు పోగవుతాయి. అప్పుడు భారమంతా కాటలిటిక్‌ కన్వర్టర్‌పై పడుతుంది. సాధారణంగా 900 డిగ్రీల సెంటీగ్రేడ్‌తో వేడిగా ఉండే ఈ విభాగం 1100 డిగ్రీలకు చేరుతుంది. ఫలితంగా..చుట్టుపక్కలుండే హీట్‌ షీల్డ్‌లు, మెటల్‌ ఫ్లోర్‌ ప్యాన్‌లు వేడెక్కి క్యాబిన్‌ ఇన్సులేషన్‌, కార్పెటింగ్‌లను కూడా దహించి వేస్తాయి.

విద్యుదాఘాతం జరిగితే..

వాహనాలు మంటల్లో చిక్కుకోవడానికి మరో ప్రధాన కారణం ఎలక్ట్రిక్‌ సిస్టమ్‌ పాడవడం. బైక్‌కి హెడ్‌లైట్‌ నుంచి టెయిల్‌ లైట్‌ వరకు ఎలక్ట్రిక్‌ వైరింగ్‌ విస్తరించి ఉంటుంది. కారులో అయితే బ్యానెట్‌ కింద, ఇంటీరియర్‌లో, డోర్లు, కార్పెట్‌ కింద, సీట్ల కింద..ఎక్కడంటే అక్కడ ఉంటాయి. ఒక్కసారి విద్యుదాఘాతం జరిగితే క్షణాల్లో వాహనమంతా మంటలు చెలరేగుతాయి. ఊహించని ప్రమాదం జరుగుతుంది. గ్యాస్‌లు లీక్‌ కావడం.. గ్యాస్కెట్‌, రేడియేటర్లలో పగుళ్లు కూడా మంటలు పుట్టడానికి కారణమవుతాయి. పెట్రోల్‌, డీజిల్‌, ఇంజిన్‌ ఆయిల్‌, ట్రాన్స్‌మిషన్‌ ఫ్లూయిడ్‌, పవర్‌ స్టీరింగ్‌ ఫ్లూయిడ్‌, బ్రేక్‌ ఫ్లూయిడ్‌, కూలంట్‌.. ఇవన్నీ కారు నడుస్తున్నపుడు సర్క్యులేట్‌ అవుతుంటాయి. ఇవి ప్రవహించే ద్వారాలు, పైపులు, నిల్వ ఉండే రిజర్వాయర్లు పాడై లీకేజీ అయినా, పగిలిపోయినా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. పెట్రోల్‌ సాధారణంగా 7.2డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. మండినపుడు 258 డిగ్రీలకు చేరుకుంటుంది. దీన్ని బట్టి మంట ఎంత త్వరగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

గాబరా పడకుండా ఇలా చేస్తే మేలు..

ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు..గాబరా పడొద్దని చెబుతున్నారు నిపుణులు. వాహనాన్ని ఎడమపక్కకు తీస్కెళ్లి ఆపాలి. ఒకవేళ బానెట్‌ నుంచి పొగలు వస్తున్నా, చిన్నగా మంటలు మొదలైనా ఇంజిన్‌ ఆఫ్‌ చేయాలి. బానెట్‌ని ఎత్తి ఇంజిన్‌ చల్లబడేవరకూ అలాగే ఉంచాలి. కూలంట్‌ రిజర్వాయర్‌ ట్యాంక్‌ని తెరిచి తగినంత ఉందో లేదో ఓసారి పరిశీలించాలి. ఈ సమయంలో రేడియేటర్‌ ప్రెషర్‌ మూత చాలా వేడిగా ఉంటుంది. ఏదైనా గుడ్డతో ఆ మూత తీయాలి. ఇంజిన్‌ చల్లబడేవరకు ఎదురు చూడాలి. ఈలోగా అత్యవసర సర్వీసులైన 101, 108లకు ఫోన్‌ చేయాలి. స్థానికుల సాయం తీసుకుంటే మంచిది. మంటలు పెరిగితే వాహనం నుంచి దూరంగా వెళ్లిపోవడమే మంచిది. ఒంటరిగా మంటలార్పే ప్రయత్నం చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సర్వీసింగ్​తోనే సెఫ్టీ..

అసలు ఈ ముప్పు వాటిల్లకుండా ఏం చేయాలో చెబుతున్నారు వాహన రంగ నిపుణులు. వాహనాలను నిర్ణీత సమయానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించాలి. ప్రతి కారు 4 వేల కిలోమీటర్ల తర్వాత సర్వీసింగ్‌కు ఇవ్వాలి. ఆ సమయంలో పాడైపోయిన ఎయిర్‌ ఫిల్టర్లు, ఆయిల్‌ ఫిల్టర్లు, ఇంజిన్‌ కూలంట్‌, ఇంజిన్‌ ఆయిళ్లు మార్చుతారు. ఇవి భవిష్యత్తు ప్రమాదాలను నివారిస్తాయి. లిక్విడ్‌, ఫ్లూయిడ్‌ లీకేజీలను తరచూ పరిశీలిస్తూ సరిచేసుకుంటే ఓవర్‌హీటింగ్‌ సమస్యలు తీరతాయి. ప్రమాదం జరగకుముందే మేల్కోవచ్చు. బైక్‌, కారు.. ఏదైనా విద్యుత్తు ఉపకరణాలు ఏమేం అవసరం ఉంటాయో అన్నీ వాహనంతోపాటే వస్తాయి. కొత్తగా చేర్చాల్సిన పన్లేదు. అదనంగా వచ్చే వాటితో అదనపు ముప్పుగా భావించాలి.

ఏమాత్రం తేడా వచ్చినా..

వేసవిలో కార్లలో ఏసీల వాడకం ఎక్కువ. వీటిని ఎక్కువ సమయం, హై మోడ్‌లో పెడితే కంప్రెషర్‌ మీద భారం ఎక్కువై ఇంజిన్‌ కంపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగే అవకాశం ఉంది. వీలైతే మధ్యమధ్యలో ఆఫ్‌ చేస్తూ ఉండాలి. వేసవి మొదలవడానికి ముందే ఓసారి ఏసీ డక్ట్స్‌, రిఫ్రిజిరెంట్‌ లెవెల్స్‌ని పరిశీలించిన సర్వీసింగ్‌ చేయించాలి. అంతకుముందు చాలాకాలంపాటు ఏసీ సరిగా వాడకుండా ఉండటం వల్ల అందులో వ్యర్థాలు అడ్డుపడి ఉంటాయి. అలాగే ఉపయోగిస్తే సిస్టమ్‌ మొత్తం వేడెక్కే ప్రమాదం ఉంది. హానికారక వాయువులను వడకట్టే క్యాటలిటిక్‌ కన్వర్టర్‌, బయటికి వదిలే పొగగొట్టాలు అత్యధిక వేడితో ఉంటాయి. కంబషన్‌ ప్రక్రియతో వీటిలో అత్యధిక ఉష్ణం పుడుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా మంటలు చెలరేగేందుకు ఇవి ప్రధాన కారణమవుతాయి. ఎక్కువ దూరం ప్రయాణించినపుడు మధ్యమధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. కాంప్రెహెన్సివ్‌ బీమా తీసుకున్న వాహనం అగ్ని ప్రమాదంలో ఎంత నష్టపోయినా పరిహారం అందుతుంది.

ఎండుగడ్డి, ఇంధనాలు, త్వరగా మంటలంటుకునే స్వభావం ఉన్న వస్తువుల దగ్గర వాహనాలు పార్కింగ్‌ చేయొద్దు. ఇంజిన్‌ ఆన్‌లో ఉంచకూడదు. చిన్న నిప్పురవ్వ పడ్డా మంటల తీవ్రత అధికంగా ఉంటుంది. నీడ ఉన్న ప్రదేశాల్లోనే బండ్లను పార్క్‌ చేయాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలతో వాహనాలతో పాటు ప్రాణాలనూ కాపాడుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.