వికలాంగులకు చేయూతనిచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త తేలుకుంట సతీష్ గుప్త కోరారు. లయన్స్ క్లబ్ జింఖానా సహాయ సహకారాలతో సికింద్రాబాద్ 5వ వార్డు వాల్మీకి నగర్, సంజీవయ్య నగర్లలో నివాసముంటున్న పేద వికలాంగులకు సతీష్ గుప్త వీల్ ఛైర్లను ఉచితంగా అందజేశారు.
నగరంలోని వివిధ మురికివాడల్లో నివాసముంటున్న పేద వికలాంగులను, ప్రజలను ఆదుకొని.. వారికి సహాయ సహకారాలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా పేద వికలాంగులైన మణెమ్మ, లక్ష్మీ నర్సమ్మలకు వీల్ ఛైర్లను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జింఖానా ప్రతినిధులు లక్ష్మి, జయ, సంధ్య, సునీత, మధు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కన్నా.. అమ్మ లేదని రాదని చెప్పనా!