Weekend trains from Yeswantpur to Kachiguda: యశ్వంత్‌పుర్- కాచిగూడ-యశ్వంత్‌పుర్ మధ్య వారాంతపు రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు సెప్టెంబరు 2న శుక్రవారం మ.2.20 గంటలకు బెంగళూర్ యశ్వంత్‌పుర్‌లో బయలుదేరి మరునాడు తెల్లవారుజామున 3.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందన్నారు. తిరిగి కాచిగూడలో శనివారం సాయంత్రం 3.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు యశ్వంత్‌పుర్‌కు చేరుకుంటుందన్నారు.
కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు.. కాచిగూడ నుంచి పలు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. కాచిగూడ-తిరుపతి రైలు ఈ నెల 26న రాత్రి 10.30 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరునాడు ఉదయం 10 గంటలకు తిరుపతి చేరుకుంటుందన్నారు. తిరుపతి-కాచిగూడ రైలు 27న సాయంత్రం 3.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరునాడు తెల్లవారుజామున 3.45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందన్నారు.
కాచిగూడ-నాగర్‌సోల్ రైలు 28న కాచిగూడలో రాత్రి 8.20 గంటలకు బయలుదేరి మరునాడు ఉ 8.35కు నాగర్‌సోల్ (శిరిడీ)కి చేరుకుంటుందన్నారు. నాగర్‌సోల్-కాచిగూడ రైలు 29న నాగర్‌సోల్‌లో రాత్రి 10 గంటలకు బయలుదేరి మరునాడు ఉ 9.45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందన్నారు.