ETV Bharat / city

'అది తప్పుడు ప్రచారం.. చలానా పెండింగ్​ ఉంటే వాహనాలు జప్తు చేస్తాం' - తెలంగాణ తాజా వార్తలు

పెండింగ్​ చలానాలు ఉన్న వాహనాలు జప్తు చేస్తామని.. సైబరాబాద్​ పోలీసులు స్పష్టం చేశారు. చలానాలు కట్టకపోయినా.. వాహనాలు జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం తప్పని తేల్చారు.

cyberabad police on vehicle seiz
cyberabad police on vehicle seiz
author img

By

Published : Aug 22, 2021, 7:59 PM IST

చలానాలు పెండింగ్​లో ఉన్నా.. వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి ట్రాఫిక్​ పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని హైకోర్టు చెప్పినట్లు.. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు స్పష్టం చేశారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఈనెల 11న ఓ రిట్​ పిటిషన్​ విచారణ సందర్భంగా.. వాహనదారుడు వారం రోజుల్లో దరఖాస్తు పెట్టుకుంటే వాహనం విడుదల చేయాలని మాత్రమే కోర్టు సూచించిందన్నారు. దీంతో సదరు వ్యక్తి వాహన చట్టం 1989 రూల్ 167 ప్రకారం.. పెండింగ్​ చలాన్లు చెల్లించి వాహనం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. కానీ చట్టం ప్రకారం వాహనం జప్తు చేసే అధికారం పోలీసులకు లేదంటూ కోర్టు చెప్పిందని తప్పుడు ప్రచారం జరిగిందని తెలిపారు.

కేంద్ర మోటారు వాహన చట్టం రూల్ 167 ప్రకారం.. 90 రోజులకు పైగా వాహనంపై ఉన్న జరిమానాలు చెల్లించకుంటే.. సదరు వాహనాన్ని జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీచూడండి: Consumer Forum: ట్రావెల్ ఏజెన్సీకి వినియోగదారుల కమిషన్ షాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.