ETV Bharat / city

ఎలక్ట్రానిక్స్ తయారీ గమ్యస్థానంగా తెలంగాణను మారుస్తాం : కేటీఆర్​ - కేటీఆర్ వార్తలు

వచ్చే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో రూ.70వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా.. ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్​ ట్రైనింగ్‌ ఇస్తున్నామని తెలిపారు.

ktr
ktr
author img

By

Published : Mar 20, 2021, 11:15 AM IST

Updated : Mar 20, 2021, 11:26 AM IST

ఎలక్ట్రానిక్స్ తయారీ గమ్యస్థానంగా తెలంగాణను మారుస్తామని ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. విధాన రూపకల్పనలో భాగంగా ప్రత్యేక ఎలక్ట్రానిక్స్​ విధానాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. 912 ఎకరాల్లో రెండు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు. దివిటిపల్లి, చందన్‌వెల్లిలో విద్యుత్‌ వాహనం, ఇంధన నిల్వ వ్యవస్థల అభివృద్ధికి రెండు కొత్త పారిశ్రామిక క్లస్టర్లు గుర్తించామని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్​ తయరీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్​, మహేశ్​ రెడ్డి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

'ఈ రంగాల్లో రూ.70వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి రానున్న నాలుగేళ్లలో 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 250కి పైగా ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం లక్షా 60వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. విద్యుత్ వాహన రంగం ద్వారా 40 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్‌ వాహన రంగాల్లో పరిణామాలు తెలుసుకునేందుకు ప్రత్యేక నిపుణుల బృందం, స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేశాం.'

-కేటీఆర్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

ఎలక్ట్రానిక్స్ తయారీ గమ్యస్థానంగా తెలంగాణను మారుస్తాం : కేటీఆర్​

ఇదీ చదవండి : కమిటీల నివేదిక తర్వాత నిర్ణయం: హరీశ్​ రావు

Last Updated : Mar 20, 2021, 11:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.