ETV Bharat / city

Prakasham barrage: 20 గేట్లు ఎత్తివేత.. సముద్రంలోకి కొనసాగుతున్న నీటి విడుదల - ప్రకాశం బ్యారేజ్​ నుంచి సముద్రంలోకి నీటి విడుదల

ఏపీలోని ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటి విడుదల కొనసాగుతోంది. మొత్తం 20 గేట్ల ద్వారా 8,340 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీలో ప్రస్తుత నీటి నిల్వ 3.07 టీఎంసీలు ఉంది.

prakasham barrage
ప్రకాశం బ్యారేజీ
author img

By

Published : Jul 3, 2021, 5:00 PM IST

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ రోజు అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తం 20 గేట్ల ద్వారా 8,340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ప్రకాశం బ్యారేజీలో ప్రస్తుతం 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండటంతో.. అదనపు నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఉన్నందున సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 39,700 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చింది. ఈ ప్రాజెక్టు వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తితో 7,200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. ఇక నాగార్జున సాగర్ జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి కారణంగా 62,446 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి 21,229 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.

ఇదీ చదవండి: PUVVADA: పేదరికం నుంచి విముక్తి కల్పించడమే సీఎం లక్ష్యం: పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.