ETV Bharat / city

భారీ వర్షాలకు కృష్ణానదికి కొనసాగుతోన్న వరద.. - all projects on krishna river information

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే మాత్రం ప్రవాహం కొంతవరకు తగ్గింది. శ్రీశైలానికి ఎగువనుంచి 5 లక్షల 12 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. దిగువకు 5 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నాగార్జునసాగర్​కు 4 లక్షల 25 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.

water projects on krishna river updates
కృష్ణానదికి కొనసాగుతోన్న వరద.. స్వల్పంగా తగ్గిన ప్రవాహం
author img

By

Published : Oct 19, 2020, 7:44 AM IST

కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ప్రవాహం కాస్త తగ్గింది. నారాయణపూర్ జలాశయం నుంచి దిగువకు లక్షా 13 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. జూరాలకు ఎగువనుంచి నాలుగు లక్షా 34 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... దిగువకు నాలుగు లక్షా 16 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలో 215 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 212 టీఎంసీల నీరుంది. ఎగువ నుంచి 5 లక్షల 12 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. దిగువకు 5 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు.

నాగార్జునసాగర్​ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 309 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టులోకి 4 లక్షల 25 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 5 లక్షల 23 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.

నిజాంసాగర్​లో 17.80 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 16.25 టీఎంసీల నీరుంది. ఎగువ నుంచి 62 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా 72 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్​కు 88 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా 63 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి లక్షా 20 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువకు లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని వదులుతున్నారు.

ఇదీ చూడండి: 'కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతోనే యువతకు న్యాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.