ETV Bharat / city

హుజూర్​ నగర్​లో ఓటరు చైతన్యం.. పెరిగిన పోలింగ్

కాంగ్రెస్​, తెరాస పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ అసెంబ్లీ​ ఉపఎన్నిక పోలింగ్​ ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు. ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంల, వీవీప్యాట్​ల మొరాయించడం మినహా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ఓటింగ్​ ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 84.75 పోలింగ్​ శాతం నమోదైంది.

హుజూర్​ నగర్​లో ఓటరు చైతన్యం.. పెరిగిన పోలింగ్
author img

By

Published : Oct 21, 2019, 10:28 PM IST

Updated : Oct 22, 2019, 2:18 AM IST

హుజూర్ నగర్ ఉపఎన్నిక ముగిసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య.. ఓటర్లు ఉత్సాహంగా ఓటేసేందుకు బారులు తీరారు. కీలకమైన ఈ స్థానం కోసం అధికార తెరాస, విపక్ష కాంగ్రెస్​లు తీవ్రంగానే శ్రమించాయి.

ఎవరెక్కడ నుంచి..

302 కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెదేపా అభ్యర్థి హుజూర్​నగర్​ ఎస్​పీ క్యాంపస్​ స్కూల్​లో ఓటేశారు.

ఈవీఎం మొరాయింపులు

మఠంపల్లి మండలం కేంద్రంలోని 79వ పోలింగ్​ బూత్​లో రెండు ఈవీఎంలు పదినిమిషాల పాటు మొరాయించాయి. పాలకీడు మండలం బెట్టెతండాలో వీవీప్యాట్​, బ్యాలెట్​ అనుసంధానంలో సమస్య తలెత్తెంది. నేరేడుచర్ల మండలం చింతబండలో ఈవీఎం కాసేపు ఇబ్బంది పెట్టింది. కొన్ని పోలింగ్​ కేంద్రాల్లో సరైన వెలుతురు లేక ఓటర్లు అవస్థలు పడ్డారు. చిన్న చిన్న ఘటనలు మినహా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్​ శాఖ పటిష్ఠ భద్రత కల్పించింది.

పెరిగిన ఓటింగ్​
ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమైంది. పోలింగ్​ ముగిసే సమయానికి 84.75 శాతం ఓట్లు పోలయ్యాయి. 2018 సాధారణ ఎన్నికల్లో 78.38 శాతం.. 2014లో 81.18 శాతం కంటే ఈసారి ఓట్ల సంఖ్య పెరిగింది. హుజూర్​నగర్​ మండలం అంబేడ్కర్ నగర్​లోని పాఠశాలలో సాయంత్రం ఆరున్నర వరకు పోలింగ్‌ జరిగింది.

హుజూర్​ నగర్​లో ఓటరు చైతన్యం.. పెరిగిన పోలింగ్

ఇవీచూడండి: హుజూర్​నగర్​లో గులాబీ జెండా ఎగురుతుంది: కేటీఆర్

Last Updated : Oct 22, 2019, 2:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.