ETV Bharat / city

పోలీస్​ అకాడమీలపై చేసే ఖర్చులు వృథా: వీకే సింగ్​ - vk singh comments on police academy

పోలీస్​ అకాడమీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చులు పూర్తిగా వృథా అని రాష్ట్ర పోలీస్​ అకాడమీ డైరెక్టర్​ వీకే సింగ్​ అభిప్రాయపడ్డారు. పోలీసులు ఎంత కష్టపడినా.. సేవ చేసిన ప్రజలకు హర్షించరన్నారు. కనీసం విధుల్లో మరణించినా ప్రజల నుంచి సరైన గౌరవం దక్కడం లేదన్నారు. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే కొత్త బ్యాచ్‌ శిక్షణకు నూతన పద్దతులు అమలుచేస్తామని వీకే సింగ్ వెల్లడించారు.

పోలీస్​ అకాడమీలపై చేసిన ఖర్చులు వృథా: వీకే సింగ్​
author img

By

Published : Oct 3, 2019, 2:29 PM IST

Updated : Oct 3, 2019, 5:57 PM IST

జైళ్ల శాఖలో సంస్కరణలు అమలుచేసి విజయవంతమయ్యామని.. పోలీస్​ అకాడమీలోనూ అటువంటి చర్యలే అవసరమని అకాడమీ డైరెక్టర్​ వీకేసింగ్​ అభిప్రాయపడ్డారు. దేశంలో పోలీస్​ అకాడమీలు డంపింగ్​ యార్డులుగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో సరిగా పనిచేయని వారిని అకాడమీలో పడేస్తున్నారన్నారు. అకాడమీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు మొత్తం వృథా అవుతోందని వీకే సింగ్​ అభిప్రాయపడ్డారు. నేటికి బ్రిటిష్ కాలం నాటి పద్దతుల్లోనే పోలీసుల పనితీరు కొనసాగుతోందన్నారు. సాక్షాత్తు జాతీయ పోలీస్​ అకాడమీలోను ఇటువంటి పరిస్థితులే ఉన్నాయన్నారు.

ఎస్పీ నుంచి పోలీసు ఠాణా అధికారి వరకు క్షేత్రస్థాయి పనితీరు ఆధారం చేసుకుని డీజీపీకి నివేదికను అందజేస్తానని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగానే పదోన్నతులు కల్పించాలని కోరారు. జైలు వస్తున్న వారిలో 90 శాతం బీదవారేనన్న వీకే సింగ్.. అసలు ఏ నేరంపై అరెస్టయ్యారో చాలా మందికి తెలియడం లేదన్నారు.

పోలీస్​ అకాడమీలపై చేసిన ఖర్చులు వృథా: వీకే సింగ్​

ఇవీచూడండి: 'ప్రజావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తా'

Last Updated : Oct 3, 2019, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.