ETV Bharat / city

Wash Conclave 2022 : 'అలా చేస్తే సమాజాన్ని రోగాల బారినుంచి కాపాడొచ్చు' - ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Wash Conclave 2022 : స్వచ్ఛమైన తాగు నీరు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించడం ద్వారా సమాజాన్ని రోగాలబారి నుంచి కాపాడేందుకు వీలుంటుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌ జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలో "నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత - డబ్ల్యూఏఎస్‌హెచ్‌ - 2022"పై జరిగిన జాతీయ సమాలోచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Venkaiah Naidu
Venkaiah Naidu
author img

By

Published : Feb 23, 2022, 10:38 PM IST

Wash Conclave 2022 : స్వచ్ఛమైన తాగు నీరు అందించినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం నిర్మించడం సాధ్యమవుతుందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలో "నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత - డబ్ల్యూఏఎస్‌హెచ్‌ - 2022"పై జరిగిన జాతీయ సమాలోచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్‌ఐఆర్‌డీ, యూనెసెఫ్ సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న ఈ వర్చువల్ సదస్సును చెన్నైలో రాజ్‌భవన్‌ నుంచి అంతర్జాతీయ వేదిక ద్వారా ఆయన ప్రారంభించారు.

మూడు రోజులపాటు వర్చువల్ జరిగే ఈ సదస్సులో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, యూనిసెఫ్ భారత్ ప్రతినిధి గిలియన్ మెల్సోప్ పాల్గొన్నారు. కరోనా సమయంలో అందరికి తరచుగా చేతులు కడుక్కోవడం అలవాటైందని... ఇకపై కూడా కొనసాగించడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. చిన్నతనం నుంచే పిల్లలకు పరిశుభ్రతపై పూర్తి అవగాహన కల్పించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

'అలా చేస్తే సమాజాన్ని రోగాల బారినుంచి కాపాడొచ్చు'

'వ్యాధుల నివారణలో కనీస అవసరాలైన స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజల ఆరోగ్యానికి బాటలు వేస్తాయి. మంచి పారిశుద్ధ్యం ఉంటే ప్రతి ఏడాది లక్షమంది ప్రాణాలు కాపాడినట్లేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో నిర్వహించిన ఒక సర్వే స్పష్టం చేసింది. గ్రామాల్లోని లోపభూయిష్ట పారిశుద్ధ్య విధానాల వల్ల సగటున 11రెట్లు భూగర్భజలాలు కలుషితమవుతున్నట్లు మరో సర్వే తెలిపింది. అందువల్ల కీలకమైన ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.' -ఎం.వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ఇదీ చూడండి : చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతా: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.