ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశాఖకు చేరుకున్నారు. ఉపరాష్ట్రపతికి ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. పోర్టు అతిధిగృహంలో ఆయన బస చేయనున్నారు.
పర్యటనలో భాగంగా రేపు రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇదీ చదవండి: KCR Review: పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారంపై సీఎం సమీక్ష