Prashanth reddy comments: పార్టీ కోసం శ్రమించే వారికి సమయం వచ్చినపుడు తప్పక సముచిత గౌరవం దక్కుతుందని.. రోడ్లు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా.. మెట్టు శ్రీనివాస్ ప్రమాణస్వీకార చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీలోకి ఎంతమంది వచ్చినా.. ముందు నుంచి శ్రమించే వారిని కేసీఆర్ తప్పక గుర్తుంచుకుంటారని ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
"కార్యకర్త అయినా.. నాయకుడైనా.. పార్టీ కోసం నిబద్ధతతో, నాయకత్వానికి విధేయతతో పనిచేసిన వారికి సమయం సందర్భం వచ్చినప్పుడు మంచి స్థానాన్ని, అవకాశం కల్పిస్తారనటానికి మెట్టు శ్రీనివాస్‌కు దక్కిన గుర్తింపే ఓ మచ్చుతునక. పార్టీలోకి ఎవరెవరో వస్తున్నారని బెంబేలెత్తిపోవొద్దు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరి స్థానం వారికి ఉంటుంది. పార్టీని, ప్రభుత్వాన్ని నడపటానికి కావాల్సిన నాయకులను తీసుకుంటారు. ఎవ్వరూ కూడా అధైర్యపడొద్దు. అసహనానికి లోను కావొద్దు." - వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి
ఇదీ చూడండి: