ETV Bharat / city

Vegetables price hike in Telangana : కూర'గాయం'.. టమాటా మరీ పిరం - vegetables price hike in telangana

కార్తిక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో చాలా మంది శాకాహారానికే ప్రాధాన్యమిస్తారు. ఫలితంగా కూరగాయలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ధరలు(Vegetables price hike in Telangana) భగ్గుమంటున్నాయి. కిలో టమాటా రూ.60 ఉండగా క్యారెట్, చిక్కుడు, బీన్స్ కిలో రూ.80 పలుకుతోంది. కార్తిక మాసం కావడం వల్ల మాంసాహారానికి గిరాకీ తగ్గింది. ఫలితంగా ధర పడిపోయింది.

Vegetables price hike in Telangana
Vegetables price hike in Telangana
author img

By

Published : Nov 8, 2021, 8:30 AM IST

కార్తిక మాసం(Karthika Masam 2021) ప్రారంభమైంది.. కూరగాయల ధరలు(Vegetables price hike in Telangana) భగ్గుమంటున్నాయి. టమాటా మరీ పిరమైంది. ఓ మోస్తరు రకం రైతుబజాల్లో రూ.34 ఉండగా బయట మార్కెట్లో కిలో రూ.60(Tomato price today) ఉంది. ఉల్లి.. టమాటాతో పోటీ పడుతోంది. టమాటా ఏమాత్రం బాగున్నా రైతు బజారులో రూ.40కి తక్కువ అమ్మడంలేదు. ఉల్లి రూ.40 నుంచి రూ.50 లోపు అమ్ముతున్నారు. మిగతా కూరగాయల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. క్యారెట్‌, చిక్కుడు, బీన్స్‌ కిలో రూ.80 పలుకుతుంటే.. శీతాకాలం కావడంతో మంచి మునక్కాయలు దొరకడంలేదు. రంగుమారినవే ఒక్కోటి రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.

పెరిగిన కొనుగోలుదారులు

కార్తిక మాసం(Karthika Masam) ప్రారంభం కావడంతో రైతుబజార్లలో కూరగాయల కొనుగోలుదారులు పెరిగారు. మెహిదీపట్నం, ఎర్రగడ్డ రైతుబజార్లకు వారాంతాల్లో 8-10 వేల మంది వరకూ వస్తే ఆదివారం 14 వేలు దాటిందని రైతుబజార్ల ఎస్టేట్‌ అధికారులు చెప్పారు. నాణ్యమైన కూరగాయలు లేవని కొనుగోలుదారులు వాపోతున్నారు.

మాంసం అమ్మకాలపై ప్రభావం

కార్తిక మాసం(Karthika Masam) కావడంతో కోడి మాంసం కొనుగోళ్లు బాగా తగ్గాయని మాదాపూర్‌లోని మాంసం విక్రయదారుడు సాయి తెలిపారు. వారం క్రితం రూ.150 ఉన్న లైవ్‌ చికెన్‌ ధర ఆదివారం రూ.135కి తగ్గింది. స్కిన్‌లెస్‌ ధర వారం క్రితం కిలో రూ.240 ఉండగా.. ఆదివారం రూ.220గా ఉంది. చేపల మార్కెట్లలోనూ రద్దీ అంతంత మాత్రంగానే ఉంది. 30 శాతం కొనుగోళ్లు తగ్గాయని ఓయూ కాలనీకి చెందిన మాంసం విక్రేత యాదగిరి చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.