ETV Bharat / city

కరోనా అంబులెన్స్ స్టీరింగ్ చేతబట్టిన నారీ శక్తి ! - తమిళనాడు ప్రభుత్వం

‘పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి సాధించడం అంత సులభం కాదు’... ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏ రంగంలోనైనా స్త్రీలు పురుషులతో సమానంగా పని చేసేందుకు పోటీ పడుతున్నారు. ఎంత కష్టమైనా సరే.. సవాలుగా తీసుకుని మరీ ఆ రంగంలోకి అడుగు పెడుతున్నారు. వైద్యం, విద్య, రాజకీయాలు, జర్నలిజం, ఇంజినీరింగ్‌, ఆర్మీ, వ్యాపారం, నేవీ, పరిశోధన... వంటి రంగాలతో పాటు ఫుడ్‌ డెలివరింగ్‌, క్యాబ్‌ డ్రైవింగ్‌, లోకోపైలట్‌... లాంటి శారీరక శ్రమతో కూడిన రంగాల్లో సైతం సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారీ తరం మహిళలు. తాజాగా స్ర్తీ శక్తిని మరోసారి చాటుతూ ‘108’ అంబులెన్స్‌ స్టీరింగ్‌ పట్టుకుంది ఓ మహిళ. తద్వారా దేశంలో తొలిసారిగా అంబులెన్స్‌ డ్రైవర్‌గా నియమితురాలైన తొలి మహిళగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.

కరోనా అంబులెన్స్ స్టీరింగ్ చేతబట్టిన నారీ శక్తి !

author img

By

Published : Sep 4, 2020, 4:41 PM IST

దేశంలోనే తొలి అంబులెన్స్‌ డ్రైవర్‌గా !

కరోనా కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం తాజాగా 118 అంబులెన్స్‌లను రోడ్లపైకి తీసుకొచ్చింది. కొవిడ్‌ రోగుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఈ వాహనాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు. ఇక అంబులెన్స్‌ల నిర్వహణ కోసం మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ద్వారా జూనియర్‌ అసిస్టెంట్లతో పాటు పలువురు డ్రైవర్లకు నియామాక పత్రాలను జారీ చేశారు.

వీరలక్ష్మికి నియామక పత్రం...

ఈ క్రమంలో వీరలక్ష్మి ముత్తుకుమార్‌ అనే మహిళకు అంబులెన్స్‌ డ్రైవర్‌గా నియామక పత్రం అందించిన సీఎం... ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మరెందరో మహిళలు ఉత్సాహంగా ముందుకు రావాలని కోరారు.

అందుకే ఈ జాబ్‌లో జాయినయ్యాను!

ఆటోమొబైల్‌ టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసిన వీరలక్ష్మి దేశంలో ‘108’ అంబులెన్స్‌ స్టీరింగ్‌ పట్టుకున్న తొలి మహిళగా గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే ఆదాయం కోసం మాత్రమే ఈ ఉద్యోగంలో చేరలేదంటోందీ సూపర్‌ ఉమన్.

నాకెంతో సహకరిస్తున్నారు...

‘నేను మూడేళ్లుగా చెన్నై నగరంలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. ఈ విషయంలో నా భర్త, ఇద్దరు పిల్లలు అండగా ఉంటూ నాకెంతో సహకరిస్తున్నారు. ‘జీవితంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు...ఏ పనిచేసినా మనస్ఫూర్తిగా చేయాలి’ అని అమ్మ నాతో చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. ‘108’ అంబులెన్స్‌ డ్రైవర్‌ పోస్టుల కోసం ఖాళీలు ఉన్నాయని తెలియడంతో నేనూ దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూ కూడా క్లియర్‌ చేశాను.

నాకు ఆ విషయం తెలియలేదు...

అయితే నియామక పత్రం అందుకున్నాక కానీ నాకు తెలియలేదు... ‘దేశంలో ‘108’ అంబులెన్స్‌ డ్రైవర్‌గా నియమితురాలైన తొలి మహిళ నేనే’ అని. ప్రస్తుతం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. అయితే చాలామంది అనుకున్నట్లు ఏదో ఆదాయం కోసం మాత్రమే ఈ ఉద్యోగంలో చేరడం లేదు. కరోనా కారణంగా ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నా వంతు సాయం చేయడానికే ఈ జాబ్‌లో జాయినయ్యాను’ అంటోంది వీరలక్ష్మి.

భయం లేదు.. భద్రతకు లోటు లేదు!

కరోనా వైరస్‌ మనుషులను చంపుతుంటే... అది సృష్టించిన భయం మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. కరోనా రోగులేదో పాపం చేసినట్లు సొంతింటి వాళ్లే దూరం పెడుతున్న దీన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రాణాలను పణంగా పెడుతూ కొవిడ్‌ రోగులను ఆస్పత్రికి తీసుకెళుతూ, తిరిగి వారిని ఇంటికి చేర్చే పనికి సిద్ధమైంది వీరలక్ష్మి.

అన్నీ తెలుసుకున్నాకే...

‘108’ అంబులెన్స్‌ డ్రైవర్‌గా నేను నిర్వర్తించాల్సిన విధులేంటో నాకు స్పష్టంగా తెలుసు. అన్నీ తెలుసుకునే ఈ ఉద్యోగంలో చేరాను. విధుల్లో భాగంగా నాకూ కరోనా సోకుతుందేమోనన్న భయం ఏ మాత్రం లేదు. అలా అని నా ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయను. ఈ వైరస్‌ నుంచి రక్షణ పొందడానికి అవసరమైన జాగ్రత్తలన్నింటినీ తీసుకుంటాను. ప్రభుత్వం కూడా మా భద్రతకు పెద్దపీట వేస్తూ అంబులెన్స్‌ వాహనాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ సూపర్‌ ఉమన్.

కరోనా అంబులెన్స్ స్టీరింగ్ చేతబట్టిన నారీ శక్తి !
కరోనా అంబులెన్స్ స్టీరింగ్ చేతబట్టిన నారీ శక్తి !

మహిళా శక్తి ...

కరోనా పేరెత్తితేనే ఆమడ దూరం పారిపోయే రోజులివి. ఈ పరిస్థితుల్లో తన కాళ్ల మీద తాను నిలబడుతూ వైరస్‌ బాధితుల్ని తరలించేందుకు సిద్ధమైంది వీరలక్ష్మి. మరి, మహిళా శక్తిని చాటుతూ సాహసోపేత నిర్ణయం తీసుకున్న ఆమెను అందరూ అభినందించాల్సిందే.

ఇవీ చూడండి : ఫైబ్రాయిడ్ ఉంది.. ఏ చికిత్స శ్రేయస్కారం ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.