హైదరాబాద్ వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణపై బదిలీ వేటు పడింది. తక్షణమే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అవినీతి ఆరోపణలు రావడం వల్ల ఇతనిపై బదిలీ వేటు వేసినట్లుగా సమాచారం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న గాంధీనారాయణ... గతంలో కూడా అవినీతికి పాల్పడ్డాడని ఉన్నతాధికారుల విచారణలో తేలింది. దీంతో ఇతన్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈయన స్థానంలో భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకరయ్యను ఇన్ఛార్జిగా నియమించారు.
ఇవీ చూడండి: "రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు"