ETV Bharat / city

వాల్మీకి రామాయణం బాలకాండ ఆడియో, పుస్తకం ఆవిష్కరణ

author img

By

Published : Feb 14, 2021, 7:44 PM IST

రామకృష్ణానంద రచించిన వాల్మీకి రామాయణం బాలకాండ ఆడియో, పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం వెంగళ్​రావ్ నగర్​లోని శక్తి ఆడిటోరియంలో జరిగింది. మొల్ల, విశ్వనాథ సత్యనారాయణ, శేషసాయి, కరుణశ్రీ లాంటి విశిష్ట కవులు రాసిన పద్యాలను ఇందులో ఉదహరించారు.

Valmiki Ramayana Bala Kanda Audio and  book launch at shakti auditorium in hyderabad
వాల్మీకి రామాయణం బాలకాండ ఆడియో, పుస్తకం ఆవిష్కరణ

హైదరాబాద్​ వెంగళ్​రావ్ నగర్​లోని శక్తి ఆడిటోరియంలో రామకృష్ణానంద రచించిన వాల్మీకి రామాయణం బాలకాండ ఆడియోను, పుస్తకాన్ని శ్రీరామ్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని పద్యాలతో సందర్భోచితంగా రచించారన్నారు. సుఖ దు:ఖాలు అంటే రాముడే కన్పిస్తాడని.. రామాయణంలో అందరూ తమను తాము చూసుకుంటారని ఆయన పేర్కొన్నారు. విశిష్ట కవులైన మొల్ల, విశ్వనాథ సత్యనారాయణ, శేషసాయి, కరుణశ్రీ లాంటి వారు రాసిన పద్యాలను ఇందులో ఉదహరించారని వివరించారు.

అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించి.. మానవ విలువల్ని పరిరక్షించుకుంటూ ఆచరణాత్మకంగా ముందుకు సాగాలని మరో అతిథి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. రాముడు నడిచే దారి రామాయణమని.. విశ్వం అనేది సుఖదుఃఖాలతో నిండి ఉంటుందని పుస్తక రచయిత రామకృష్ణానంద తెలిపారు. ఒక ఆదర్శవంతమైన మూర్తి.. మార్గదర్శి.. మానవ జీవితానికి స్పూర్తి శ్రీరాముడని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయుల జీవన వేదం రామాయణమన్నారు.

ఇదీ చూడండి: పర్వతారోహణలో సత్తా చాటుతున్న అన్వితా రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.