శని, ఆదివారాలు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మొదటి రెండు డోస్‌ల మధ్య కనీసం 12 వారాల వ్యవధి ఉండాలని కేంద్రం ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించిన కొవిడ్ సెకండ్ డోస్ స్పెషల్ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కేంద్రం నిబంధనల ప్రకారం... కొవిషీల్డ్ తీసుకున్న వారు 12 నుంచి 16 వారాల మధ్య మాత్రమే రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో ఇప్పటికి వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అత్యధిక శాతం కొవిషీల్డ్ తీసుకున్న నేపథ్యంలో... రెండో డోస్ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్టు సర్కారు స్పష్టం చేసింది. సోమవారం తిరిగి వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ... ఈ నెల 17 నుంచి ఎవరికి వ్యాక్సిన్ ఇస్తారు, మొదట డోస్ వారికి ఎప్పటినుంచి వ్యాక్సినేషన్ ఇస్తారు, వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు..
ఇదీ చదవండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు