పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో వైఫల్యానికి నైతిక బాధ్యతగా విధుల నుంచి తప్పుకున్నారు. పీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఏఐసీసీని ఉత్తమ్‌ను కోరారు.
ఇటీవల దుబ్బాక ఉపఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ... బల్దియా ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని చవిచూసింది. గతంలో మేయర్ పీఠాన్ని అధిరోహించిన హస్తం పార్టీ... ఈసారి అట్టడుగు స్థానంలో నిలిచింది. గతంలోలాగే రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయటం వల్ల ఇప్పడు కొత్త సారథి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీలో రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం