ETV Bharat / city

గ్రేటర్​లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్​ షో - కూకట్​పల్లిలో యోగి ఆదిత్యానాథ్ రోడ్​షో

హైదరాబాద్​లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ రోడ్​ షో నిర్వహించారు. గ్రేటర్​లో భాజపా అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ కూకట్​పల్లిలో ప్రచారం చేశారు.

up cm yogi adithyanath road show in hyderabad kukatpally
గ్రేటర్​లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ రోడ్​ షో
author img

By

Published : Nov 28, 2020, 5:26 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని భాజపా మరింత వేడెక్కిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... కూకట్‌పల్లి రోడ్‌ షోకు కమలం ‍శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఉషా ముళ్లపూడి కమాన్‌ నుంచి అల్విన్‌ ప్రధాన కూడలి వరకు రోడ్‌ షో సాగనుంది. యోగి ఆదిత్యనాథ్‌కు భాజపా, జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

బల్దియా ఎన్నికల్లో భాజపా విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేశారు. యోగి ఆదిత్యనాథ్​తోపాటు రోడ్‌ షోలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, మురళీధర్‌రావు, జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తెరాస ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం: బండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.