సైబర్ నేరాలు అరికట్టేందుకు కొత్త టెక్నాలజీతో పాటు, కొత్త చట్టాలు తీసుకువస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో సైబర్ సెక్యూరిటీ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైబర్ సెక్యూరిటీలో మరిన్ని పరిశోధనలు జరగాలని, సైబర్ నేరాల అప్పగింతలో ఇతర దేశాలతో కేంద్రం ఒప్పందాలు చేసుకుంటోందని తెలిపారు. ఈ సదస్సులో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్తో పాటు సైబర్ భద్రత చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : ఉవ్వెత్తున ఉరకలేస్తున్న కృష్ణమ్మ