ETV Bharat / city

Kishan Reddy on YCP: "రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు ఉండకూడదు"

Kishan Reddy on YCP: రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు ఉండకూదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్​లో అమరావతే రాజధాని అనే విషయంలో తమ పార్టీది ఏకాభిప్రాయమైన నిర్ణయమని స్పష్టం చేశారు. కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు, ఇతరుల విడివిడి అభిప్రాయాలు ఉండవని తెలిపారు.

Kishan
Kishan
author img

By

Published : Oct 17, 2022, 12:32 PM IST

Kishan Reddy on YCP: ఆంధ్రప్రదేశ్​లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ పర్యటనలో ఉద్రిక్తతలు తలెత్తడాన్ని భాజపా తీవ్రంగా తప్పుపట్టింది. ఒకరోజు పర్యటనలో భాగంగా ఏపీకి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు ఉండకూడదని గన్నవరం విమానాశ్రయం వద్ద మీడియాతో అన్నారు. రాజకీయ పార్టీలు ఎవరి కార్యక్రమాలు వారు నిర్వహించుకోవాలని.. వాటిని నిలువరింపజేయడం సరికాదన్నారు. ఏడాదిన్నరపాటు దిల్లీలో రైతులు ధర్నా చేస్తే వారికి వసతులు కల్పించామని.. రైతు సంఘాలతో ఒప్పందాలు చేసుకుని వారి సమస్య పరిష్కారానికి ప్రయత్నించామని తెలిపారు.

"రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు ఉండకూదు. రాజకీయ పార్టీలు ఎవరి కార్యక్రమాలు వారు నిర్వహించుకోవాలి. దిల్లీలో ఏడాదిన్నరపాటు రైతులు ధర్నా చేస్తే వారికి వసతులు కల్పించాం. రైతు సంఘాలతో ఒప్పందాలు చేసుకుని సమస్య పరిష్కారానికి ప్రయత్నించాం. దేశవ్యాప్తంగా తాము ఇదేతరహా విధానాన్ని అమలు చేస్తున్నాం. అమరావతే రాజధాని అనే విషయంలో తమ పార్టీది ఏకాభిప్రాయమైన నిర్ణయం. కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు, ఇతరుల విడివిడి అభిప్రాయాలు ఉండవు." -కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

తమ పార్టీ దేశవ్యాప్తంగా ఇదే తరహా విధానాన్ని అమలు చేస్తోందన్నారు. అమరావతే రాజధాని అనే విషయంలో తమ పార్టీది ఏకాభిప్రాయమైన నిర్ణయమని.. ఇందులో కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు, ఇతరులవి విడివిడి అభిప్రాయాలు ఉండబోవని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ.. రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరిట 12వ విడత డబ్బులను వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో తాను వర్చువల్‌గా ఏలూరులో పాల్గొనేందుకు వచ్చినట్లు కిషన్​రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.