Kishanreddy on Cm Kcr National Party: రాష్ట్రంలో తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ కొత్త నాటకమాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దురుద్దేశంతో ఏర్పాటు చేసిన ఏ పార్టీ.. ఇప్పటి వరకు ప్రపంచంలో మనుగడ సాధించలేదని చెప్పారు. భాజపాను గద్దె దించుతామంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా విపక్షాల నేతలెవరూ కేసీఆర్‌ను నమ్మలేదన్న కిషన్‌రెడ్డి.. తెరాసకు మిగిలిన ఏకైక పార్టీ మజ్లిస్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఎవరి కోసమే తెలియక తెరాస నేతలే తలలు పట్టుకుంటున్నారని.. ఎన్ని నాటకాలాడిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
'మజ్లిస్ బలోపేతం కోసమే కేసీఆర్ జాతీయ పార్టీ. ప్రగతిభవన్‌కు అసదుద్దిన్ ఓవైసీ బుల్లెట్ మీద నేరుగా వెళ్తారు. తెరాసకు మిగిలిన ఏకైక మిత్రపక్షం మజ్లిస్ మాత్రమే. కల్వకుంట్ల కుటుంబం అంధకారంలోకి పోతోంది. తెరాస పట్ల ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రంగా పెరుగుతోంది. తెరాస వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే జాతీయ పార్టీ పెడుతున్నారు. జాతీయ పార్టీ మీద తప్ప.. తెరాస వైఫల్యాల మీద చర్చ జరగొద్దు అనేది కేసీఆర్ ఆలోచన.' -కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
'కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకో.. తెరాస నేతలకే తెలియదు. ప్రధాని కావాలని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కలలు కంటున్నారు. కవిత కేంద్రమంత్రి, కేటీఆర్ తెలంగాణ సీఎం అయినట్లు కలలు కంటున్నారు. భాజపా, తెరాస నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. ఐఏఎస్ అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు. పార్లమెంటులో ఇప్పుడున్న ఎనిమిది సీట్లతో దేశంలో ఎలా చక్రం తిప్పుతారు? కల్వకుంట్ల కుటుంబసభ్యులకు నిద్రలోనూ ఈడీ, సీబీఐ, ఐటీ కనిపిస్తున్నాయి' అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: