ETV Bharat / city

Employees Strike: ఈ నెల 21న ఉద్యోగ సంఘాల సమ్మె సైరన్​..

author img

By

Published : Jan 19, 2022, 8:33 PM IST

Employees Strike: ఏపీ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగాలని నిర్ణయించాయి. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోను వ్యతిరేకిస్తూ... ఈ నెల 21న సీఎస్​కు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.

union-leader-bandi-srinivasan-said-the-strike-notice-would-be-issued-to-cs-on-may-21

Employees Strike: పీఆర్సీని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగాలని ఏపీ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వ జీవోలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 21న సీఎస్​కు సమ్మె నోటీసు ఇస్తామని ఏపీజేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడించారు. డీఏలు, 27 శాతం ఐఆర్‌తో కూడిన పాత జీతాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తమను మోసం చేసిందన్న బండి శ్రీనివాసరావు... ఉద్యోగులు తమ భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.

ఈనెల 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తాం. పీఆర్సీని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగాలని నిర్ణయించాం. ప్రభుత్వ జీవోలను బేషరతుగా రద్దు చేయాలి. డీఏలు, 27 శాతం ఐఆర్‌తో కూడిన పాత జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఉద్యోగులు తమ భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేరు.

- బండి శ్రీనివాసరావు, ఏపీజేఏసీ ఛైర్మన్

కొత్త పీఆర్సీతో నష్టమే...

కేంద్రం మాదిరిగా రాష్ట్ర ఉద్యోగులకు లబ్ధి చేకూర్చట్లేదని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. డీఏ, పీఆర్సీ కలిపి జీతం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... డీఏ, పీఆర్సీ రెంటినీ వేర్వేరుగా చూడాలని సూచించారు. కొత్త పీఆర్సీ అమలు వల్ల ఉద్యోగులకు నష్టమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు డీఏల వల్ల ఉద్యోగులకు రూ.9 వేలు పెరుగుతుందన్న వెంకట్రామిరెడ్డి... పీఆర్సీ ఇవ్వకపోయినా ఉద్యోగులకు జీతం పెరుగుతుందని తెలిపారు. ఉద్యోగులకు పీఆర్సీ నివేదిక చూపకుండానే, వారితో ఎలాంటి చర్చలూ జరపకుండానే నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.

కేంద్రం మాదిరిగా రాష్ట్ర ఉద్యోగులకు లబ్ధి చేకూర్చట్లేదు. కొత్త పీఆర్సీ అమలు వల్ల ఉద్యోగులకు నష్టమే. ఐదు డీఏల వల్ల ఉద్యోగులకు రూ.9 వేలు పెరుగుతుంది. పీఆర్సీ ఇవ్వకపోయినా ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. పీఆర్సీ అమలు చేసేటపుడు ఉద్యోగులకు ఆప్షన్‌ ఇస్తారు. ఉద్యోగులకు నివేదిక చూపకుండానే నిర్ణయం తీసుకున్నారు.

- వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఆదాయం తగ్గిందని చెప్పడం విడ్డూరం...

ఏ ప్రాతిపదికన పదవీ విరమణ వయసును 62 ఏళ్లు చేశారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రశ్నించారు. సీఎస్‌, ఆర్థికశాఖ అధికారుల భేటీలో కొత్త విషయాలేవీ లేవన్న ఆయన... నివేదికలో శాస్త్రీయత, వాస్తవికత లోపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రాష్ట్రం భారీగా ఆదాయం ఆర్జించిందని కాగ్‌ చెబుతున్నా... ఆదాయం భారీగా తగ్గిందని సీఎస్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కాగ్‌ చెప్పిన అంశాలను తమ విజయంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓ వైపు భారీగా ఆదాయం ఆర్జించినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు రాబడి తగ్గిందని ఉద్యోగులకు చెబుతున్నారు. రాబడి తగ్గిందంటూ సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వ విజయంగా చెబితే తప్పుడు నివేదిక ఇచ్చారంటూ కాగ్‌కు నోటీసులు ఇవ్వాలి. కాగ్‌ నివేదిక సరైనదైతే సీఎస్‌పై చర్యల విషయమై సీఎం విజ్ఞతకే వదిలేస్తున్నాం.

- సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.