ఏపీలోని విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వివరాల వెల్లడికి కేంద్ర ఆర్థికశాఖ నిరాకరించింది. ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ అడిగిన సమాచారం ఇచ్చేందుకు నిరాకరించింది. 'ఉక్కు'లో పెట్టుబడుల ఉపసంహరణ ఆర్థిక రహస్యాల పరిధిలోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖలకు జవాబివ్వాలని పీఎంవో ఆదేశించినా డీఐపీఏఎం పట్టించుకోలేదు. ఆర్‌ఐఎన్‌ఎల్ విక్రయంపై సమాచారం గోప్యమని ఆర్థికశాఖ డీఐపీఏఎం పేర్కొంది.
ఇదీ చదవండి: Live Video: పట్టపగలే యువకుడు కాల్చివేత