ETV Bharat / city

ఆ వంట చూస్తే వాంతే.. తిన్నవారి గతి అంతే

author img

By

Published : Apr 9, 2022, 7:53 AM IST

Unhygienic conditions in hospitals : ఇటీవల వరంగల్‌ ఎంజీఎంలో ఓ వ్యక్తిని ఎలుకలు కొరికిన ఘటనతో ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా వరకు ఆస్పత్రుల్లో రోగులకు ఆహారాన్ని అందించే వంటశాలలు మురికి కూపంలా మారాయి. ఎలుకలు, బొద్దింకలు, పిల్లులు, కుక్కలు హాయిగా తిరుగేస్తున్నాయి. దీనివల్ల రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పాకశాలల పారిశుద్ధ్యంపై ఈనాడు-ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Unhygienic conditions in hospitals
Unhygienic conditions in hospitals

Unhygienic conditions in hospitals : ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఆహారాన్ని అందించే పాకశాలలు వంట వ్యర్థాల పాకుడు పట్టి అధ్వానస్థితికి చేరాయి. గాలి, వెలుతురు సోకని ఇరుకు గదుల్లో కొనసాగుతున్నాయి. ఎలుకలు, బొద్దింకలు, పిల్లులు, కుక్కలు హాయిగా తిరిగేస్తున్నాయి. పెద్దాసుపత్రులైన గాంధీ, ఉస్మానియాల్లోని వంటశాలలు ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో కనీస వసతుల్లేని గదుల్లో వండుతున్నారు. ఇక్కడ తయారు చేసే ఆహారమే రోగులకు వడ్డిస్తున్నారు. ఆహారం కలుషితమైతే.. రోగులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. వంటవాళ్లు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలేదు. నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పాకశాలల్లో ‘ఈనాడు’ ప్రత్యక్ష పరిశీలన చేయగా పలు లోపాలు కన్పించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్క ముందే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

మురుగు తిష్ఠ : గాంధీ ఆసుపత్రి సెల్లార్‌లో ఇన్‌పేషెంట్లకు వండే వంటశాల ఉంది. ఇందులో మురుగు పారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో మురుగు పొంగిపొర్లుతోంది. పందికొక్కులు, ఎలుకల కారణంగా ఫ్లోరింగ్‌ మొత్తం పాడైంది. విధిలేని పరిస్థితుల్లోనే అక్కడే వండుతున్నారు. వర్షాలు పడినప్పుడు పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటోంది. తక్షణం వ్యవస్థను ఆధునికీకరించాల్సి ఉంది.

పాతదే దిక్కు.. మెహిదీపట్నం సరోజిని నేత్రాలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల రోగులు వస్తుంటారు. రోజు వందల సంఖ్యలో శుక్లాల ఆపరేషన్లు చేస్తుంటారు. ఏళ్ల క్రితం నిర్మించిన వంటశాలే ఇక్కడ దిక్కు. రోజు 60 మంది రోగులు, వారి సహాయకులకు రెండు పూటల భోజనం, అల్పాహారం తయారు చేస్తుంటారు. పరిశుభ్రత ఫర్వాలేదనిపిస్తున్నా, గోడలు పాత కాలం నాటివి కావడంతో పాడయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థతో పాటు, వంటశాలను ఆధునికీకరించాలి.

కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో వంటగది పక్కనే మ్యాన్‌హోల్‌
  • కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో సౌకర్యాలు లేని ఇరుకు గదే వంటశాల. అపరిశుభ్ర వాతావరణం ఉంది.
  • సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆసుపత్రిలోని పురాతన భవనంలో రెండు ఇరుకు గదుల్లో వంట వండుతున్నారు. 200 మంది రోగులకు, వైద్యులకు ఇక్కడే వండాలి. చీకటి, అరకొర సౌకర్యాలు, అపరిశుభ్రమైన వాతావరణం తాండవిస్తోంది.
ఉస్మానియాలో అస్తవ్యస్తంగా ఉన్న వంటశాల ఫ్లోరింగ్‌

శుభ్రత అంతంతే : రోజూ 700 మంది రోగులతోపాటు వైద్యులు, సిబ్బందికి వంట వండే ఉస్మానియా వంటశాలలో శుభ్రత అంతంత మాత్రమే. పరిసరాల్లో పిల్లులు, కుక్కలు సంచరిస్తున్నాయి. ఫ్లోరింగ్‌ సరిగా లేదు. ఆహారం పంపిణీ చేసే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలేదు. ఈగలు, దోమలు, బొద్దింకలు తిరుగుతున్నాయి. మూసీ పక్కనే ఉండటంతో ఎలుకలు వస్తున్నాయి.

ఎంఎన్‌జే ఆసుపత్రి వంటగది పైభాగం దుస్థితి

సౌకర్యాలలేమి : ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి తాత్కాలిక వంటశాలలో కొనసాగుతోంది. చాలా అధ్వానంగా ఉంది. రోజు 400 మందికి భోజనాలు తయారు చేస్తారు. కనీస సౌకర్యాలు లేవు. గాలి, వెలుతురు లేని రెండు ఇరుకు గదుల్లోనే కొనసాగిస్తున్నారు. సామగ్రి భద్రపరిచిన గది సీలింగ్‌ ఊడిపోయింది. గోడల్లోంచి నీళ్లు కారుతున్నాయి. పక్కనే చెత్తాచెదారాలు ఉన్నాయి. వెంటనే శాశ్వత వంటశాలను నిర్మించాల్సి ఉంది.

నిలోఫర్‌ ఆసుపత్రిలో ఫర్వాలేదన్నట్లుగా పరిస్థితి

ఛాతి ఆసుపత్రిలో కొంత మెరుగు : నిలోఫర్‌ ఆసుపత్రితోపాటు, ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో వంటగదులు కొంత మెరుగ్గా ఉన్నాయి. సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తున్నారు. ఛాతి ఆసుపత్రిలో వంటగదికి విశాలమైన భవనాన్ని కేటాయించారు. రోజు 150-200 మంది రోగులకు వండుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.