ETV Bharat / city

బల్దియా ఫలితాల్లో.. 13 చోట్ల అనూహ్య తీర్పు - జీహెచ్​ఎంసీ ఫలితాలు

బల్దియా ఎన్నికల ఫలితాలు ఈసారి ఏ నియోజకవర్గంలో చూసినా వైవిధ్యమే. ఓటర్లు అనూహ్య తీర్పు ఇచ్చారు. పక్కాగా గెలుస్తామని ఆశలు పెట్టుకొన్న అభ్యర్థుల అంచనాలు తలకిందులైపోయాయి. పలు చోట్ల కొన్ని పార్టీలు బోణీ చేయలేని పరిస్థితి కనిపించింది.

Unexpected judgment in 13 places in ghmc elections 2020
బల్దియా ఫలితాల్లో.. 13 చోట్ల అనూహ్య తీర్పు
author img

By

Published : Dec 6, 2020, 10:12 AM IST

గ్రేటర్‌ పరిధిలోకి 24 నియోజకవర్గాలు వస్తే అందులో 13 చోట్ల ఒక్క డివిజన్‌నూ తెరాస దక్కించుకోలేకపోయింది. ఈ పదమూడింటిలోనే 75 వరకు డివిజన్లు ఉన్నాయి. 2016 ఎన్నికల్లో ఈ డివిజన్లలో సగం గెల్చుకోవడంతో భారీ విజయాన్ని తెరాస నమోదు చేసింది. వీటిలో ఇప్పుడు 25 స్థానాలలో గెలుపొందినా మేయర్‌ పీఠం సునాయాసమయ్యేది. అక్కడ ఎందుకిలా జరిగిందన్న దానిపై అధిష్ఠానం విశ్లేషణ చేస్తోంది.

ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ..

  • పాతబస్తీలోని 7 నియోజకవర్గాల్లో 44 డివిజన్లు ఉంటే తెరాస గత ఎన్నికల్లో మూడింటిలో విజయం సాధించింది. ఈసారి ఒక్కటీ దక్కకపోగా గతంలో గెలుపొందిన మూడింటిలోనూ భాజపా పాగా వేసింది.
  • ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉంటే గతసారి తెరాస వీటన్నింటిని గెల్చుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది..అనంతరం తెరాసలో చేరారు. అన్ని డివిజన్లనూ తెరాస గెలుస్తుందని భావించగా.. మొత్తం భాజపాకే వచ్చాయి.
  • రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో అయిదు స్థానాలుంటే అందులో మూడింట గతంలో తెరాస గెలుపొందింది. ఇక్కడ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తోడ్పాటుతో నాలుగు స్థానాల్లో గెలుస్తారని ఆ పార్టీ అంచనా వేసుకుంది. ఒక్కటీ తెరాస గెలవకపోగా.. ఎమ్మెల్యే సోదరుడు సైతం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో ఓడిపోయారు.
  • ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఆరు స్థానాలుంటే గతసారి అయిదింటిలో తెరాస గెలిచింది. ఎమ్మెల్సీ కవితతోపాటు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ తీవ్రంగా పోరాడినా ఒక్క స్థానాన్ని కూడా తెరాస దక్కించుకోలేకపోయింది. ఎమ్మెల్యే మరదలు పద్మ గాంధీనగర్‌ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు.
  • మహేశ్వరంలో రెండు స్థానాలుంటే గతసారి ఒకటి తెరాస దక్కించుకుంది. ప్రస్తుతం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గట్టి కృషి చేసినా ఒక్కటీ దక్కలేదు.
  • గోషామహల్‌ నియోజకవర్గంలో 5 స్థానాలలో భాజపా విజయం సాధించి తెరాసపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
  • కంటోన్మెంట్‌లోని ఒక డివిజన్‌ గ్రేటర్‌ పరిధిలోకి వస్తుంది. 2016లో ఇక్కడ తెరాస గెలవగా ఈసారి భాజపా కైవసం చేసుకుంది.

భాజపాకు ఆరింటిలో దక్కని ప్రాతినిథ్యం

24 నియోజకవర్గాల్లో భాజపాకు 6 చోట్ల మాత్రమే ఈ ఎన్నికల్లో ప్రాతినిథ్యం దక్కలేదు. వాటిలో మూడు పాతబస్తీ పరిధిలోకి వచ్చే చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, బహుదూర్‌పుర... మిగిలినవాటిలో జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌, పటాన్‌చెరులో తప్ప అన్నింటా ఉనికి చాటుకొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.