ETV Bharat / city

Telugu Traveller : పదోతరగతి చదవి.. ప్రపంచాన్ని చుట్టేశాడు - తెలుగు ట్రావెలర్

Telugu Traveller : చదివింది పదో తరగతే అయినా తన తెలివితో అనుకున్నది సాధించాడు. తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా పట్టుదలతో అనుకున్నది సాధించాడు. ఇంతకు అతను ఏం చేశాడు.. అతనికున్న క్రేజ్​ ఏంటి..?

Telugu Traveller Uma Prasad
Telugu Traveller Uma Prasad
author img

By

Published : Dec 30, 2021, 12:24 PM IST

Telugu Traveller : ఆ యువకుడు చదివింది పదో తరగతి.. అయితేనేమీ ప్రపంచంలోని 197 దేశాలు తిరిగి.. అక్కడి విశేషాలను ప్రజలకు తెలియజేయాలని ఆకాంక్షించాడు.. ఇందుకు తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా మొక్కవోని దీక్షతో తనకున్న కొద్దిపాటి తెలివి తేటలను జోడించి చేతిలోని చరవాణికి పని చెప్పాడు కృష్ణాజిల్లాకు చెందిన ఉమాప్రసాద్​. ఉమా తెలుగు ట్రావెలర్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి దేశ, విదేశాల్లో వాహనాలు వెళ్లలేని గిరిజన ప్రాంతాలకు సైతం వెళ్లి, వారి జీవన విధానాన్ని వీక్షకులకు అందిస్తున్నాడు.

Uma Telugu Traveller : కృష్ణా జిల్లా మొవ్వ మండలం మూలపాలానికి చెందిన ఎం. రామశేషయ్య, నాగమల్లేశ్వరి దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. రామశేషయ్య పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు ఉమాప్రసాద్‌ తల్లిదండ్రులతో కలసి ప్రస్తుతం గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపనిలో నివాసం ఉంటున్నాడు.

తక్కువ ఖర్చుతో ప్రయాణం

Telugu Traveller YouTube Channel :వాస్తవానికి ఉమాప్రసాద్‌ వరుస క్రమంలో పది దేశాలు తిరిగిన తరవాత కొద్ది రోజులు స్వస్థలం చేరుకుని తల్లిదండ్రులతో గడుపుతాడు. ఇలా ఇప్పటికి రెండు పర్యాయాలు 20 దేశాల పర్యటన పూర్తి చేశారు. ఇంకో చిత్రమేమిటంటే బస్సులు, రైళ్ల సౌకర్యం ఉన్న దేశాలకు ఉమాప్రసాద్‌ విమానాల ద్వారా ప్రయాణానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. బస్సులు, రైళ్లలో ఎక్కువగా ప్రయాణిస్తూ ఖర్చులను తగ్గించుకునేవారు. గైడు సాయంతో ఆంగ్లంలో మాట్లాడుతూ ఆయా దేశాల్లో దొరికే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకున్నారు. ఆయన వెంట స్లీపింగ్‌ బ్యాగ్‌, ఎక్కడైనా ఉండడానికి టెంట్‌, దుస్తులు వెంట తీసుకెళ్తారు.

ఏడు లక్షల మంది వీక్షకులు

Telugu Traveller Uma Prasad : ఉమాప్రసాద్‌ కూలి పని చేయగా వచ్చిన రూ.1.5లక్షలు సంపాదించి వాటితో ప్రపంచ దేశాలను చుట్టేయాలనుకున్నాడు. రోడ్డు పైకి వచ్చి పెద్దగా ఖర్చు పెట్టకుండా దారినపోయే వాహనదారులను లిప్టు అడుగుతూ పది రోజుల్లో వేమూరు మండలం బూతుమల్లి నుంచి నేపాల్‌ దాకా వెళ్లాడు. అక్కడ జర్మనీకి చెందిన ఓ ట్రావెలర్‌ ఉమాప్రసాద్‌కు పరిచయమయ్యారు. ఇలా ప్రపంచ దేశాలను చుట్టేయడం సాధ్యం కాదని సలహా ఇవ్వడంతో అంతటితో తన ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశాడు. పొట్టచేత పట్టుకుని కూలి పని కోసం ఆఫ్రికా ఖండంలోని మాలీ దేశం వెళ్లాడు. అక్కడ పని చేస్తూ తన కలను సాకారం చేసుకోవాలనుకున్నాడు.

2020 మే 23న యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి అక్కడ సాగవుతున్న తెలుగు పంటలను అందులో పెట్టాడు. వీక్షకులు ఆదరించడంతో అక్కడే 60కి పైగా వీడియోలు తీసి యూటూబ్‌లో పెట్టడంతో తన వీడియోలను చూస్తున్న వీక్షకులు లక్షకు చేరారు. దానిపై వచ్చే సంపాదనతో ప్రపంచ పర్యటన మొదలుపెట్టాడు. విదేశాలకు వెళ్లడానికి వీసా కోసం ఎంబసీలో దరఖాస్తు చేసుకునేవాడు. లేదంటే ఏజెంట్ల సాయం ద్వారా వీసాను పొందేవాడు.

ఇలా దుబాయ్‌, టాంజానియా, ఆఫ్రికా ఖండంలోని ఉగాండ, నమీబియా, కెన్యా తదితర దేశాలు తిరిగి అక్కడి ప్రజల జీవన సైలి, ప్రకృతి అందాలను, అడవుల్లో సంచరిస్తున్న మృగాలు, గిరిజనుల జీవన విధానాలను యూటూబ్‌లో పెట్టేవారు. ప్రస్తుతం అతన్ని 7లక్షల మంది వీక్షకులు ఫాలో అవుతున్నారు. ఛానల్‌ ద్వారా వచ్చే ఆదాయంతో కేవలం 14 నెలల కాలంలో 20 దేశాలను చుట్టేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.