అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. శనివారం ఉదయం 11 గంటలకు రెండు నిమిషాలు దేశవ్యాప్తంగా మౌనం పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడి వారు అక్కడే.. పనులు, కదలికలు ఆపేయాలని అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది.
కేంద్రం ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌లోని ప్యాటీ-ప్యారడైజ్-సంగీత్ కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలు నిలిపివేశారు. రెండు నిమిషాలు వాహనదారులతో పాటు మౌనం పాటించారు. వాహనదారులంతా ఎక్కడివారక్కడే ఆగి.. అమర వీరులకు నివాళులర్పించారు.
కూడలి నలువైపులా రెడ్ సిగ్నల్ వేసి.. ప్రతి ఒక్కరు ఇందులో భాగమయ్యేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో ప్యాట్నీ సెంటర్ వద్ద ఆంబులెన్స్ రావడం వల్ల మానవతా దృక్పథంతో.. పోలీసులు ఆంబులెన్స్‌ను పంపించారు.
- ఇదీ చూడండి : రాజ్‌ఘాట్ వద్ద 'గాంధీ'కి మోదీ సహా ప్రముఖుల నివాళులు