ఆర్మీ ఉద్యోగుల రుణాల కోసం అవసరమైన సర్వీసు ధ్రువపత్రాలను అందిస్తామని నమ్మించి నకిలీ పత్రాలను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాజధాని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ రసూల్ పురాకు చెందిన నరేశ్ ఫ్రీ లాన్సర్ ఏజెంట్గా పని చేస్తూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమైన నిందితుడు.. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు.
నకిలీ పత్రాలు
బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అవసరమైన ధ్రువపత్రాలను అందిస్తామని ప్రకటనలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వారికి రుణం ఇప్పించేందుకు డబ్బులు మాట్లాడుకుని అందుకు అవసరమైన నకిలీ పత్రాలను సృష్టించేవారు. దీనికి సంబంధించిన స్టాంపులను కూడా ఓ వ్యక్తి వద్ద తయారు చేయించినట్లు వెల్లడించారు. ఈముఠా కదలికలపై అనుమానం వచ్చిన కొంతమంది ఆర్మీ సిబ్బంది.. నిఘా పెట్టి టాస్క్ ఫోర్స్, కార్ఖానా పోలీసుల సాయంతో పట్టుకున్నారు. మరో నిందితుడు అనిల్ కుమార్ పరారీలో ఉన్నాడు.
ఇదీ చూడండి: ఇంట్లోనే దొరికేశారు.. పక్కగదిలో ఇంకో ఇద్దరున్నారు!