ETV Bharat / city

Paddy Procurement in Telangana : ట్విటర్‌లో వడ్ల వార్.. తెరాస, కాంగ్రెస్‌ల మాటల యుద్ధం

Paddy Procurement in Telangana : రాష్ట్రంలో వరియుద్ధం రాజకీయ వేడి రాజేస్తోంది. ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ.. తెరాస, భాజపా తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు. దీనికి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కౌంటర్‌ ఇస్తూ దశాబ్దాలుగా రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్‌.. అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని ట్విటర్‌లో కోరారు. ప్రతిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగానే బదులిచ్చారు.

Paddy Procurement in Telangana
Paddy Procurement in Telangana
author img

By

Published : Mar 30, 2022, 6:55 AM IST

  • తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది.#FightForTelanganaFarmers

    — Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Paddy Procurement in Telangana : ధాన్యం కొనుగోలుపై తెరాస-భాజపా మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగుతున్న మాటల యుద్ధంలోకి కాంగ్రెస్‌ ప్రవేశించింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో స్పందించారు. వడ్ల కొనుగోలులో భాజపా, తెరాస ప్రభుత్వాల వైఖరి దారుణంగా ఉందని మండిపడ్డారు. ధాన్యం సేకరణను కేంద్రం, రాష్ట్రం రాజకీయం చేస్తున్నాయన్న రాహుల్ గాంధీ.. రైతులను ఇబ్బంది పెట్టడం ఆపాలని.. ప్రతి ధాన్యం గింజ కొనాలని డిమాండ్ చేశారు. ధాన్యం పూర్తిగా కొనే వరకు తెలంగాణ రైతుల తరఫున కాంగ్రెస్ పోరాటం చేస్తుందని రాహుల్ స్పష్టం చేశారు.

  • Rahul Ji,

    Your party has been given opportunity to govern this country for over 50+ years. When in power INC couldn’t provide even 6 hours of electricity to farmers causing distress & suicides

    In Telangana with innovative schemes like Rythu Bandhu, Rythu Bhima, Mission Kakatiya https://t.co/s4RDdrp8pJ

    — KTR (@KTRTRS) March 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

TRS Congress Twitter War : రాహుల్ ట్వీట్‌పై ఐటీ మంత్రి కె.తారకరామారావు ఘాటుగా స్పందించారు. 50 ఏళ్లు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌ రైతులకు కనీసం ఆరుగంటలు కరెంట్ ఇవ్వలేకపోయిందని విమర్శించారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను సీఎం కేసీఅర్ తెచ్చారని.. సాగుకి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి విప్లవం తీసుకొచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. పనితీరులో తమ ప్రభుత్వం కాంగ్రెస్ కన్నా మెరుగ్గా రాణించిందన్నారు. దశాబ్దాలుగా రైతులను విస్మరించిన కాంగ్రెస్ తొలుత కర్షకులకు క్షమాపణ చెప్పాలని కోరారు. విమర్శలు మానుకొని ధాన్యం కొనుగోలు చేయబోమని మొండికేస్తున్న దిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రాహుల్‌ను కేటీఆర్ కోరారు.

  • మామ చల్లని చూపుకోసం అల్లుడి ఆరాటం చూస్తే జాలేస్తోంది. భవిష్యత్ లో పారా బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ మామ ఆదేశంతో రాసిచ్చిన లేఖ ఇదిగో చూడండి హరీష్.
    మా పార్టీ సెంట్రల్ హాల్ లో ఫోటో షూట్ చేయదు… రైతుల కోసం నిఖార్సైన ఫైట్ చేస్తుంది.@trsharish #FightForTelanganaFarmers pic.twitter.com/09Ge3KkGIk

    — Revanth Reddy (@revanth_anumula) March 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యచరణకు మద్ధతుగా నిలిచిన శ్రీ రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. https://t.co/myxEgIQOAf

KTR Tweet to Rahul Gandhi : కేటీఆర్‌ ట్వీట్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. తెరాస ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యమ కార్యచరణకు మద్ధతుగా నిలిచిన రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

  • తెలంగాణ పై దొంగ ప్రేమ, మొసలి కన్నీల్లు ఆపండి రాహుల్‌ గాంధీ గారు..
    తెలంగాణ ప్రజల మేలు కోరుకునేవాళ్లే అయితే పార్లమెంట్‌ లో మా ఎంపిలతో కలిసి మీరు ఆందోళన చేయండి
    రైతుల ఉసురుపోసుకుంటోన్న కేంద్రం తీరును ఎండగట్టే పని చేయండి. https://t.co/ie53QrrW1m

    — Harish Rao Thanneeru (@trsharish) March 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Harish Rao Reacts On Rahul's Tweet : రాహుల్‌ ట్వీట్ పై స్పందించిన మంత్రి హరీశ్‌రావు.. తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపండని ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల మేలు కోరుకునే వాళ్లయితే పార్లమెంట్‌లో తెరాస ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొనాలని సూచించారు. సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ ఫొటో షూట్ చేయదని.. రైతుల కోసం నిఖార్సయిన ఫైటింగ్ చేస్తుందని రేవంత్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయాలకు వరి రైతులు బలవుతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ ట్వీట్‌లో తప్పు ఏముందని ప్రశ్నించిన నేతలు ఎవరి ప్రయోజనాల కోసం తెరాస నేతలు పోరాటం చేస్తున్నారని నిలదీశారు.

తెలంగాణ ప్రజలు నూకలు తినాలన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల తీరును కాంగ్రెస్ సమర్ధిస్తున్నట్లు కనిపిస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ.. ధాన్యం సేకరణ అంశం కేంద్రం పరిధిలో ఉంటుదనే విషయం మరచి, భాజపాకు వత్తాసు పలకటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. కేంద్రంపై పోరాటంలో రాష్ట్ర రైతుల పక్షాన కలిసిరావాలని చురుకలంటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.