కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏడాది కాలంలో ప్రభుత్వంలోని అన్ని విభాగాలు అచేతనావస్థలోకి వెళ్లాయని తెతెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు.
కేసీఆర్ పాలనలోని వైఫల్యాలను ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. బుధ, గురువారాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో, శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద నిరసనలు తెలపనున్నట్లు రమణ వివరించారు.
ఇదీ చూడండి: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై సిట్ కార్యాచరణ ప్రారంభం