TTD Board Meeting: రెండు సంవత్సరాల తర్వాత భక్తుల మధ్య జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ తీర్మానాలను ఛైర్మన్ మీడియాకు వివరించారు. తిరుపతిలో సర్వదర్శన టైంస్లాట్ టోకెన్ జారీ విధానంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామన్నారు. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో టైమ్‌స్లాట్ టోకెన్లు జారీ చేయకూడదని నిర్ణయించామన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై మరింత అధ్యయనం చేసిన అనంతరం టోకెన్ల జారీపై నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణాలకు 154 కోట్ల రూపాయలతో టెండర్లకు సమావేశంలో ఆమోదం తెలిపింది. కరోనాతో ఆగిపోయిన వైభవోత్సవాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలో పార్వేట మండపాన్ని ఆధునికీకరణ పనుల కోసం రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎస్వీ గోశాల ఆవులకు పది నెలలకు సరిపడా ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో పశుగ్రాసం కొనుగోలు చేయాలని సమావేశం తీర్మానించింది. నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో స్విమ్స్ ఆసుపత్రిలో ఐటీ విభాగం అభివృద్ధికి నిధులు కేటాయించాం. పోటు ఆధునీకరణ, మార్క్‌ఫెడ్ ద్వారా 12 రకాల వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలుకు తీర్మానం చేశాం. వైవీ సుబ్బారెడ్డి, తితిదే ఛైర్మన్
ఇవీ చదవండి: