గణేశ్ ఉత్సవాలకు వాడే విద్యుత్‌ను కరెంట్ తీగలకు కొండీలు తగిలించి తీసుకుని వినియోగించడాన్ని నేరంగా పరిగణిస్తామని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. గణేశ్ మండప నిర్వాహకులు విధిగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలని సూచించారు.
మండప నిర్వాహకులకు ప్రత్యేక టారీఫ్‌లను ఏర్పాటు చేశారు. 250-500 వాట్ల వినియోగానికి రూ.1000, అలాగే 500-1000 వాట్లకు రూ.1500లు, ఆపైన వినియోగించే ప్రతి 500 వాట్ల విద్యుత్ వాడకానికి రూ.750 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 2018-19 నిబంధనల ప్రకారం తాత్కాలిక సరఫరా కేటగిరిలో ప్రతి యూనిట్‌కు రూ.11, కిలోవాట్‌కు రూ.21లు నెల చొప్పున ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : 'రూలర్' బాలయ్య కొత్త లుక్ అదుర్స్