ETV Bharat / city

"ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే" - TSRTC_OPPOSITIONS_SUPORT

కార్మికుల న్యాయమైన డిమాండ్‌లను వెంటనే నెరవేర్చి.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. కేసీఆర్​ వైఖరి వల్లే కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారని ఆరోపించాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయ్యాల్సిందే"
author img

By

Published : Oct 14, 2019, 5:15 AM IST

Updated : Oct 14, 2019, 6:47 AM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు పోరు తప్పదని పలు పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షడు కోదండరాం అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు.

"ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెేయాల్సిందే"

ఎవరి సొత్తని ఆస్తులు కట్టబెడతారు

హైదరాబాద్‌లో పీఆర్టీయూ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి రేవంత్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్ధంగానే జరుగుతోందని రేవంత్‌రెడ్డి అన్నారు. కార్మికుల సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాలని కోరారు. ఆర్టీసీ ఆస్తులను ఇతరులను కట్టబెడితే ఊరుకునేది లేదని ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. సమ్మెపై ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఆర్టీసీ నష్టాలకు మీరే కారణం

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు... ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శలు గుప్పించారు. తెరాస పాలనలోనే ఆర్టీసీకి తీవ్రంగా నష్టాలు వచ్చాయని ఆరోపించారు. సమ్మె విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఒకే వేదిక పైకి వచ్చి పోరాటం చేయాలని నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ కోరారు. హామీలు అమలు చేయకుండా కార్మికులు సమ్మె చేసేలా ప్రభుత్వమే చేసిందని ఆరోపించారు.

ఇవీ చూడండి: మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య

Intro:Body:Conclusion:
Last Updated : Oct 14, 2019, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.