కరోనా మహమ్మారి.. ఆర్టీసీని తీవ్ర నష్టాల్లో(tsrtc crisis)కి నెట్టివేసింది. ఇప్పుడిప్పుడే తిరిగి ప్రయాణికుల ఆదరణతో ఆర్టీసీ గాడిలో పడుతోంది. ఇటీవలే సంస్థలో సమూల మార్పులు(tsrtc new rules) చోటు చేసుకున్నాయి. నష్టాల్లో ఉన్న సంస్థను గాడిలో పెట్టేందుకు.. మూడేళ్ళుగా ఖాళీగా ఉన్న ఆర్టీసీ ఛైర్మన్(tsrtc new chairman), ఎండీ(tsrtc new md) పదవులను సైతం ప్రభుత్వం భర్తీ చేసింది. ఇలాంటి సమయంలో అనవసర ఆడంబరాలకు పోయి కొందరు దుబారా ఖర్చులు(telangana rtc expenditure) చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కొత్తగా ఎవరొస్తే వారికి కొత్త కార్లు..
ఇటీవలే సంస్థకు ఛైర్మన్, ఎండీని సర్కారు నియమించింది. నిబంధనల ప్రకారం సంస్థలో కొత్త వారిని నియమిస్తే.. వారికి కొత్త కారు, ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2017 -18లో అప్పటి ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ కోసం సుమారు రూ.28 లక్షల రూపాయలతో ఇన్నోవా కారు కొనుగోలు చేసింది. ఆ తరువాత ఛైర్మన్ 2018 వరకు ఆ వాహనాన్ని వినియోగించారు. పదవీకాలం ముగిసిపోవడంతో ఆ కారును ఎవ్వరూ వినియోగించలేదు. మాజీ ఛైర్మన్ వినియోగించిన ఇన్నోవా వాహనాన్ని ప్రస్తుతం సంస్థలోని ఓ ఈడీ వినియోగిస్తున్నారు.
విలువైన, విలాసవంతమైన కారు..
ప్రస్తుతం నియమించిన ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్కి రూ.37 లక్షల రూపాయల విలువైన, విలాసవంతమైన కియా కార్నివాల్ వాహనాన్ని ఆర్టీసీ సంస్థ కొనిచ్చింది. ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు తాను సంస్థ ఇచ్చే కారును వినియోగించనని గతంలోనే ఆర్టీసీ ఛైర్మన్ ప్రకటించారు. కానీ.. సంస్థ మాత్రం ఏకంగా 37 లక్షలు ఖర్చుపెట్టటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇంతటితో ఆగని ఆర్టీసీ.. త్వరలోనే రవాణా శాఖ మంత్రికి సైతం కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని భావిస్తోంది. అందుకు సంబంధించి.. పలు కార్ల షోరూంలలో కొటేషన్లు సైతం తెప్పించుకుని, కొనుగోలుకు సిద్ధం అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
కిందిస్థాయి ఉద్యోగులకు సర్క్యులర్లు..
ఆర్టీసీలో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని బస్భవన్లోని ఆయా విభాగాల అధిపతులకు సంస్థ అంతర్గత సర్క్యులర్ జారీ చేసింది. చిన్న చిన్న అవసరాలను కూడా తగ్గించుకోవాలని కింది స్థాయి సిబ్బందికి సూచించిన ఉన్నతాధికారులు.. తాము చేస్తున్న దుబారాను మాత్రం సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల నెలనెలా జీతాల కోసం ఇప్పటికీ.. అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తీరుగుతున్నారు. ఈ తరుణంలో కొత్త వాహనాల కొనుగోలు పక్కన పెడితే కొంతలో కొంతైనా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కరోనా కష్టాల నుంచి ఆర్టీసీ ఇప్పుడిప్పుడే బయటపడి.. తిరిగి రోజుకు రూ.14 కోట్ల ఆదాయం ఆర్జిస్తుంది. ఇలాంటి తరుణంలో పెద్దల మెప్పు పొందేందుకు లక్షల రూపాయలు పెట్టి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలన్న నిర్ణయం ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చూడండి: